Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ సరికొత్త రికార్డ్.. స్టార్ హీరోలందర్నీ వెనక్కి నెట్టేసి..

ఇటీవల కళ్యాణి ‘లోక చాప్టర్ 1: చంద్ర అనే సూపర్ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (Kalyani Priyadarshan)

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ సరికొత్త రికార్డ్.. స్టార్ హీరోలందర్నీ వెనక్కి నెట్టేసి..

Kalyani Priyadarshan

Updated On : October 9, 2025 / 4:34 PM IST

Kalyani Priyadarshan : మలయాళ కుట్టి కళ్యాణి ప్రియదర్శన్ తెలుగు సినిమాలతో కూడా ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరైంది. ఇటీవల కళ్యాణి ‘లోక చాప్టర్ 1: చంద్ర అనే సూపర్ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజయి భారీ హిట్ అయింది. కేవలం 30 కోట్లు ఖర్చుపెట్టి అదిరిపోయే విజువల్స్ తో సరికొత్త కథతో ఈ సినిమాని తెరకెక్కించారు.(Kalyani Priyadarshan)

‘లోక చాప్టర్ 1: చంద్ర సినిమా కేవలం మళయాళంలోనే కాక తమిళ్, తెలుగు, హిందీలో కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమా ఆగస్టు 29న రిలీజవ్వగా ఇప్పటికి థియేటర్స్ లో ఆడుతుంది. సుమారు 20 రోజుల క్రితం ఈ సినిమా 275 కోట్లు కలెక్ట్ చేసి మలయాళం ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందని అధికారికంగా మూవీ యూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని అందుకుంది.

Also Read : SSMB 29 : మహేష్ – రాజమౌళి సినిమా టైటిల్ ఇదేనా.. సెట్ వేస్తే అదే పెట్టేస్తారా..

ఇన్ని రోజుల వరకు మలయాళంలో మోహన్‌లాల్, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా 265 కోట్లతో మొదటి స్థానంలో, మోహన్ లాల్ తుడురమ్ 242 కోట్లతో రెండో స్థానంలో ఉండగా ఇప్పుడు లోక చాప్టర్ 1: చంద్ర సినిమా 300 కోట్లతో మొదటి ప్లేస్ లో నిలిచింది. ఆ రెండు సినిమాలను వెనక్కు నెట్టింది. కళ్యాణి ప్రియదర్శన్ వుమెన్ సెంట్రిక్ తో ఓ సూపర్ హీరో సినిమాతో మలయాళంలో స్టార్ హీరోలందర్నీ వెనక్కి నెట్టి అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన మలయాళం సినిమాగా నిలవడంతో ఆమె ఫ్యాన్స్, నెటిజన్లు, పలువురు మలయాళ ప్రముఖులు కంగ్రాట్స్ చెప్తున్నారు.

ఇక ఈ లోక చాప్టర్ 1: చంద్ర సినిమాని మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ పై డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇదొక సినిమాటిక్ యూనివర్స్ గా రానుంది. దీంట్లో 5 సినిమాలు అయితే పక్కా ఉంటాయి. అందులో రెండిట్లో దుల్కర్ సల్మాన్, టోవినో థామస్ మెయిన్ లీడ్స్ లో నటించనున్నారు. ఈ ఇద్దరూ లోక చాప్టర్ 1: చంద్ర సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి మెప్పించారు.

Also See : Sobhita Dhulipala : బ్లాక్ డ్రెస్ లో శోభిత ధూళిపాళ బ్యూటీ..