SSMB 29 : మహేష్ – రాజమౌళి సినిమా టైటిల్ ఇదేనా.. సెట్ వేస్తే అదే పెట్టేస్తారా..

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, ఒరిస్సా కోరాపుట్ అడవులు, కెన్యా, టాంజానియా అడవుల్లో జరిగింది. (SSMB 29)

SSMB 29 : మహేష్ – రాజమౌళి సినిమా టైటిల్ ఇదేనా.. సెట్ వేస్తే అదే పెట్టేస్తారా..

SSMB 29

Updated On : October 9, 2025 / 4:27 PM IST

SSMB 29 : మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నాలుగు షెడ్యూల్స్ షూటింగ్ కూడా జరుపుకుంది. ప్రస్తుతం రాజమౌళి బాహుబలి రీ రిలీజ్ పనుల్లో ఉండటంతో ఈ సినిమాకు బ్రేక్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి అప్డేట్ నవంబర్ లో ఇస్తామని మహేష్ పుట్టిన రోజున ప్రకటించారు.(SSMB 29)

గ్లోబల్ అడ్వెంచరస్ డ్రామాగా చిన్న మైథలాజికల్ టచ్ తో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, ఒరిస్సా కోరాపుట్ అడవులు, కెన్యా, టాంజానియా అడవుల్లో జరిగింది. ఈ సినిమా కోసం హైదరాబాద్ లో కాశీ సెట్ భారీగా 50 కోట్లతో వేస్తున్నారు. బాహుబలి రీ రిలీజ్ తర్వాత ఆ సెట్ లోనే మహేష్ – రాజమౌళి సినిమా షాట్ జరగనుందని సమాచారం.

Also See : Sobhita Dhulipala : బ్లాక్ డ్రెస్ లో శోభిత ధూళిపాళ బ్యూటీ..

తాజాగా మహేష్ – రాజమౌళి సినిమా టైటిల్ ఇదే అంటూ ఓ టైటిల్ వైరల్ అవుతుంది. టాలీవుడ్ రూమర్స్ ప్రకారం మహేష్ బాబు – రాజమౌళి సినిమా టైటిల్ ‘వారణాసి’ అని తెలుస్తుంది. వారణాసి అనేది కాశీకి మరో పేరు. ఆ ఊరు బ్యాక్ డ్రాప్ లోనే ఎక్కువగా ఈ కథ జరుగుతుందట. అందుకే దాన్నే టైటిల్ గా అనుకుంటున్నారట. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

ఈ సినిమా కోసం అంత పెద్ద సెట్ వేస్తున్నారని, సినిమా కథ ఆ సిటీ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని అందుకే ఆ టైటిల్ పెడతారా అని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అసలే ఇటీవల రిలీజ్ చేసిన ఓ పోస్టర్ లో మహేష్ మెడలో శివుడి త్రిశూలం, నంది, ఢమరుకం, శివ నామాలు.. ఉన్న చైన్ వేసుకున్నాడు. మరి అధికారికంగా ఈ సినిమా టైటిల్ ఎప్పుడు ప్రకటిస్తారో, నవంబర్ లో ఈ సినిమా అప్డేట్ ఏమిస్తారో చూడాలి.

Also Read : Dude Trailer: యూత్‌ఫుల్ కంటెంట్ తో ‘డ్యూడ్’ ట్రైల‌ర్.. అదరగొట్టిన ప్రదీప్..