Sai Pallavi Opens Up About Her Marriage
Sai Pallavi: ‘ఫిదా’ చిత్రంతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సాయి పల్లవి, ఆ సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో, ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది ఈ బ్యూటీ. అయితే గ్లామర్ షోకు దూరంగా ఉంటూ, కేవలం పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలే చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తుంది.
Sai Pallavi: నేనూ సాయి పల్లవి ఫ్యానే అంటోన్న బాలీవుడ్ స్టార్ డైరెక్టర్
గ్లామర్ షో చేయకుండా, కేవలం పర్ఫార్మెన్స్‌తో కూడా స్టార్‌డమ్ తెచ్చుకోవచ్చని ఈ బ్యూటీ ప్రూవ్ చేసి అందరిచేత వావ్ అనిపించింది. అయితే తాజాగా ఈ అమ్మడు తన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఆమె ప్రస్తుతం నటించిన విరాటపర్వం సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ క్రమంలోనే ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి, తన పెళ్లి గురించి ఓపెన్ అయ్యింది.
Sai Pallavi : హీరోయిన్స్‌లలో సాయిపల్లవి వేరయా..
వచ్చే ఏడాది తాను పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది ఈ అందాల బ్యూటీ. అంతేగాక.. ఇద్దరు పిల్లల్ని కూడా కనాలని ఉందంటూ తన మనసులోని మాటను చెప్పేసింది. అయితే తాను ఇంట్లో ఎక్కువగా తెలుగు మాట్లాడుతుండటంతో, తన కుటుంబసభ్యులు ఓ మంచి తెలుగు అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకోవాలంటూ సూచిస్తున్నారట. ఈ వార్తతో ఒక్కసారిగా సాయి పల్లవి అభిమానులకు షాక్ తగిలినట్లయ్యింది. మరి సాయి పల్లవి పెళ్లి చేసుకోబోయే ఆ అదృష్టవంతుడు ఎవరా అనేది చూడాలి.