Sai Pallavi reaction on boycott
Sai Pallavi : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించిన లేటెస్ట్ సినిమా అమరన్. అక్టోబర్ 31న ఈ సినిమా రిలీజ్ కానుంది. విడుదల టైమ్ దగ్గర పడుతుండటంతో ఈ చిత్రానికి సంబందించిన ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్. కేవలం తమిళ్ లోనే కాకుండా తెలుగు లో కూడా ఈ మూవీ రిలీజ్ చేస్తున్నారు. అలా ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సాయి పల్లవికి సంబందించిన ఒక పాత వీడియో ని తీసుకొని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. సాయి పల్లవి నటించిన విరాటపర్వం సినిమా 2022లో విడుదలైంది. ఈ సినిమా వడుదల సందర్బంగా సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూ లో పాకిస్థాన్‌లో ఉన్నవారు భారత సైనికులను ఉగ్రవాదులుగా చూస్తారు అని అన్నారు. అలాగే హింస ఎప్పుడూ సరైనది కాదు.. అది ఎలాంటి సమస్యలను పరిష్కరించదన్నారు. దీంతో ఆమె ఇండియన్ ఆర్మీని అవమానించిందని, ఆమెను బాయ్‌కాట్ చేయాలని కొందరు పిలుపునిస్తున్నారు.
Also Read : Aha : ఆహా బ్రాండ్ అంబాసిడర్ గా అడివి శేష్.. కొత్త వీడియో చూసారా..
ఇక ఎప్పుడో వచ్చిన ఈ వీడియోను ఇప్పుడు నెగిటివ్ గా నెట్టింట వైరల్ చెయ్యడంతో ఈ విషయంపై సాయి పల్లవి స్పందిస్తూ.. ఏ వర్గాన్ని అవమానించాలనే ఉద్దేశం ఆమెకి లేదని, ఇంటర్వ్యూలో కొంత భాగాన్ని మాత్రమే వైరల్ చేయడం చాల బాధగా ఉందని పేర్కొన్నారు. కశ్మీర్ ఫైల్స్ మూవీలో ఓ ముస్లిం డ్రైవర్ ను కొట్టి చంపిన విషయాన్ని పోల్చి చెప్పడంతో నెటిజన్స్ మరింత ఫైర్ అవుతున్నారు.