Sai Pallavi responds to trolling on social media
Sai Pallavi: సాయి పల్లవి.. ఈ పేరు వినగానే పద్ధతి, సంప్రదాయం గుర్తుకు వస్తుంది. సినిమాల విషయంలో కాదు చేసే పాత్రల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు ఆమె. అందుకే, ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా గ్లామర్ షోకి మాత్రం ఆమె ఎప్పుడు దూరంగా ఉంటారు. వల్గారిటీకి(Sai Pallavi) దూరంగా ఉండే పాత్రలే ఆమె ఇప్పటి వరకు చేస్తూ వచ్చారు. ఆమెలో ఆ సింప్లిసిటీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఏదైనా ఫంక్షన్ కి వచ్చినా కూడా చీరలో లేదా నిండైన బట్టలలోనే ఆమె అటెండ్ అవుతారు. అలా ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది ఈ బ్యూటీ.
Ravi K Chandran: పవన్ కళ్యాణ్ అలా నిల్చుంటే చాలు.. ఆ క్రేజ్ ఏ స్టార్ హీరోకి రాదు: రవి కె. చంద్రన్
అలాంటి సాయి పల్లవిపై ఇటీవల సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరిగింది. ఇటీవల ఆమె తన చెల్లితో వెకేషన్ కి వెళ్ళింది. ఆ ఫోటోలను ఎవరో Aiతో మార్ఫింగ్ చేసి బికినీలో ఉన్నట్టుగా క్రియేట్ చేశారు. దాంతో ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ సాయి పల్లవిపై దారుణమైన కామెంట్స్ చేశారు. ఇంతకాలం చాలా పద్దతిగా ఉన్న సాయి పల్లవి కి సడన్ గా ఏమైంది. ఫేమ్ వస్తే ఎవరైనా మారిపోవాల్సిందే అంటూ కామెంట్స్ చేశారు. అయితే, మరికొంత మంది మాత్రం అవి AI జనరేటెడ్ ఫోటోలు అని, సాయి పల్లవి అలాంటి పనులు ఎప్పటికీ చేయదని కామెంట్స్ చేస్తూ ఆమెకు సపోర్ట్ గా నిలిచారు.
తాజాగా, ఈ ట్రోలింగ్ పై ఇండైరెక్ట్ గా స్పందించింది సాయి పల్లవి. తన చెల్లితో కారులో వెళుతున్న ఫోటోలను షేర్ చేసి ఇవి Ai ఫోటోలు కాదు రియల్ పిక్స్ అంటూ కామెంట్ చేసింది. దాంతో, ఆమె ఖచ్చితంగా ఆ మార్ఫింగ్ ఫొటోలపైనే రియాక్ట్ అయ్యింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో రామాయణ సినిమా చేస్తున్నారు. రణబీర్ కపూర్ రాముడిగా చేస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి సీతలా కనిపించనుంది. నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.