Ravi K Chandran: పవన్ కళ్యాణ్ అలా నిల్చుంటే చాలు.. ఆ క్రేజ్ ఏ స్టార్ హీరోకి రాదు: రవి కె. చంద్రన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇండియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. (Ravi K Chandran)ఆయన కాన్సన్ ట్రేట్ చేసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఓజీ సినిమాతో మరోసారి ప్రూవ్ అయ్యింది.

Ravi K Chandran made sensational comments on Pawan Kalyan
Ravi K Chandran: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇండియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన కాన్సన్ ట్రేట్ చేసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఓజీ సినిమాతో మరోసారి ప్రూవ్ అయ్యింది. స్టైల్, యాక్టింగ్, డైలాగ్స్, ఆటిట్యూడ్ ఇలా ప్రతీ విషయంలో అదిరిపోయే రేంజ్ లో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేశాడు పవన్ కళ్యాణ్. ఓజీలో ఒక సాంగ్ లో చెప్పినట్టుగా ఆయన స్థాయి ఎవ్వరికి అందదు అన్నట్టుగానే ఉంది ప్రెజెంట్ ఆయన సిచువేషన్. ఏ హీరోకైనా(Ravi K Chandran) ఫ్యాన్స్ ఉంటారు. కానీ, హీరోలనే ఫ్యాన్స్ గా ఉన్న ఏకైక హీరో ఉంటే పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి.
తాజాగా పవన్ కళ్యాణ్ గురించి ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చాడు ప్రముఖ సీనియామాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్. ఓజీ సినిమాకు ఆయన అద్భుతమైన కెమెరా వర్క్ అందించాడు. తన ఎక్స్ట్రార్డినరీ వర్క్ తో సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాడు. ఇక సినిమా బ్లాక్ బస్టర్ సాధించిన నేపధ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు రవి కె. చంద్రన్. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నేను హిందీలోహ్రితిక్ రోషన్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్ తో సినిమా చేశాను. కానీ, పవన్ కళ్యాణ్ వేరు. ఆయన ఆరా ఎవరికీ రాదు. ఆయన జస్ట్ అలా నిలబడితే చాలు చాలా స్టైలిష్ గా ఉంటారు. ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసినా స్టైలీష్ గా కనిపించే హీరో పవన్ కళ్యాణ్. లుంగీ కట్టుకున్నా ఆయన లుక్స్ ఒక రేంజ్ లో ఉంటాయి” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రవి కె. చంద్రన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.