Sai Ram Shankar Oka Pathakam Prakaram Movie Review and Rating Here
Oka Pathakam Prakaram Movie Review : ఒకప్పుడు మంచి హిట్స్ కొట్టిన పూరి జగన్నాధ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ మధ్యలో కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చినా మళ్ళీ ఇప్పుడు వరుసగా సినిమాలతో వస్తున్నాడు. సాయి రామ్ శంకర్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఒక పథకం ప్రకారం’. మలయాళ డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వంలో గార్లపాటి రమేష్, వినోద్ కుమార్ విజయన్ నిర్మాణంలో తెరకెక్కిన ఒక పథకం ప్రకారం సినిమా నేడు ఫిబ్రవరి 7న రిలీజ్ అయింది. ఈ సినిమాలో శృతి సోది, ఆషిమా నర్వాల్, సముద్రఖని.. పలువురు కీలక పాత్రలు పోషించారు.
కథ విషయానికొస్తే.. సిద్దార్థ్ నీలకంఠ(సాయి రామ్ శంకర్) ఒక మంచి లాయర్. సీత(ఆషిమా నర్వాల్)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఒక రోజు సడెన్ గా సీత కనిపించకుండా పోతుంది. దీంతో సిద్దార్థ్ తన భార్యని వెతుకుతూ, బాధపడుతూ డ్రగ్స్ కి అడిక్ట్ అవుతాడు. దాంతో అతన్ని సస్పెండ్ చేస్తారు. ఓ రోజు అనుకోకుండా దివ్య(భానుశ్రీ) మర్డర్ కేసులో సిద్దార్థ్ ని అనుమానించి పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి.
ప్రతి మర్డర్ దగ్గర సిద్దార్థ్ కి సంబంధించి ఏదో ఒక లింక్ ఉంటుంది. అసలు ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు? సిద్దార్థ్ ని ఎందుకు ఫ్రేమ్ చేసారు? లేదా నిజంగానే సిద్దార్థ్ ఆ మర్డర్స్ చేశాడా? సిద్దార్థ్ భార్య సీత ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. రెగ్యులర్ గా కమర్షియల్ సినిమాలు చేసే సాయి రామ్ శంకర్ మొదటిసారి ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో వస్తుండటంతో ముందు నుంచి సినిమాపై ఆసక్తి నెలకొంది. ప్రమోషన్స్ లో ఇంటర్వెల్ లోపు విలన్ ని పట్టుకుంటే పదివేలు ఇస్తాం అని ప్రకటించడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ హాఫ్ సిద్దార్థ్ గురించి, అతని ప్రేమ కథ, సిద్దార్థ్ సస్పెండ్ అవ్వడం, వరుస మర్డర్స్ జరగడం, సిద్దార్థ్ ని అరెస్ట్ చేయడంతో సాగుతుంది. ఇంటర్వెల్ కి పెద్దగా ట్విస్ట్ ఇవ్వకపోయినా సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఆసక్తిగా నడిపించారు. వరుస మర్డర్స్ అసలు అవి ఎవరు, ఎందుకు చేస్తున్నారు అని సాగుతుంది.
రెగ్యులర్ గా సినిమాలు చూసేవాళ్ళు విలన్ ని గెస్ చేసేయొచ్చు. అయితే అతనే విలన్ ఎందుకు, ఎలా అనేది మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేరు. దానికి సపరేట్ ట్రాక్ రాసుకోవడంతో సినిమాకు ప్లస్ అయింది. ఆ మర్డర్స్, దానికి వదిలే క్లూస్, ఆ క్లూస్ తో కనిపెట్టడం చాలా బాగా రాసుకున్నారు. ప్రీ క్లైమాక్స్ లో విలన్ ని రివీల్ చేసే దగ్గర్నుంచి కథ చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ కాస్త బోర్ కొట్టినా ప్రీ ఇంటర్వెల్ నుంచి కథ పరిగెడుతుంది. అయితే ఇది ఓ ఐదారేళ్ళ క్రితం సినిమా కావడం గమనార్హం. స్క్రీన్ ప్లే చాప్టర్ వైజ్ డివైడ్ చేసారు. అలా చేయకపోయినా కథని నడిపించొచ్చు అనిపిస్తుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్.. ఎప్పుడూ ఫుల్ యాక్టివ్ రోల్ లో కనిపించే సాయి రామ్ శంకర్ కంప్లీట్ డిఫరెంట్ గా ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో కనిపించి తన నటనతో మెప్పించాడు. సాయి రామ్ శంకర్ కెరీర్లో ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ లా నిలుస్తుంది. అషిమా నర్వాల్ క్యూట్ గా కాసేపు మెప్పిస్తుంది. పోలీసాఫీసర్ పాత్రలో శృతి సోది మెప్పిస్తుంది. సీనియర్ పోలీస్ పాత్రలో సముద్రఖని అక్కడక్కడా నవ్విస్తారు. విలన్ గా నటించిన నటుడు కూడా క్లైమాక్స్ లో చాలా బాగా నటించాడు. ఒకప్పటి కమెడియన్ సుధాకర్ ఓ కీలక పాత్రలో కనిపించారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also Read : Thandel : ‘తండేల్’ మూవీ రివ్యూ.. నాగచైతన్య, సాయి పల్లవి ప్రేమ జంటగా అదరగొట్టేశారుగా..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ నైట్ సీన్స్, డార్క్ సీన్స్ లో బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాస్త ఎక్కువ అయింది. పాటలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. ఆసక్తికర కథతో ఫస్ట్ హాఫ్ కాస్త కమర్షియల్ అంశాలు కలిపినా ప్రీ ఇంటర్వెల్ నుంచి స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు. డైరెక్టర్ ఆల్రెడీ మలయాళంలో రెండు హిట్స్ కొట్టాడు. ఈ ఒక పథకం ప్రకారం ని కూడా బాగానే తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా కావాల్సినంత ఈ సినిమాకు ఖర్చుపెట్టారు.
మొత్తంగా ఒక పథకం ప్రకారం ఒక లాయర్ కథతో నడిచే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.