Virupaksha Trailer : చావుకు ఎదురు వెళ్లే ధైర్యముందా??.. విరూపాక్ష ట్రైలర్ రిలీజ్..

విరూపాక్ష సినిమా నుండి తాజాగా ట్రైలర్ విడుదల అయింది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకి రానుంది.

SaiDharam Tej Virupaksha Trailer Released

Virupaksha Trailer :  మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) తన సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని, తనకు కూడా అభిమానులని ఏర్పరుచుకున్నారు. సాయిధరమ్ తేజ్ కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ కి గురయి చాలా రోజులు హాస్పిటల్, ఇంట్లోనే ఉండి మొత్తం రికవర్ అయ్యాక ఇప్పుడు విరూపాక్ష(Virupaksha) సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు.

సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇటీవలే చిత్రయూనిట్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా కార్తీక్ దండు తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ఓ సాంగ్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసిన విరూపాక్ష సినిమా తాజాగా ట్రైలర్ ని విడుదల చేసింది.