Sakshi Vaidya: ఏజెంట్ దెబ్బకు అయ్యగారు వెకేషన్.. అమ్మగారు లొకేషన్..!

ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీకి సంబంధించిన డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసింది.

Sakshi Vaidya Starts Dubbing For Her Next Movie After Agent

Sakshi Vaidya: అక్కినేని అఖిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దానికి తగ్గట్టుగా ఈ మూవీ ప్రమోషన్స్‌ను భారీ స్థాయిలో చేయడంతో ఏజెంట్ బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా విజయం అందుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ, ఏజెంట్ రిలీజ్ తరువాత టోటల్ సీన్ రివర్స్ అయ్యింది.

Agent Movie: ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోన్న వైల్డ్ సాలా సాంగ్ ప్రోమో.. థియేటర్స్‌లో రచ్చరచ్చే!

ఈ సినిమాకు కనీసం యావరేజ్ టాక్ కూడా రాకపోవడంతో, ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమా కోసం రెండేళ్లుగా హార్డ్ వర్క్ చేసిన అఖిల్ ఆశలు ఆవిరయ్యాయి. ఈ సినిమా ఇచ్చిన డిజపాయింట్‌మెంట్‌తో అఖిల్ వెకేషన్ కోసం దుబాయ్ వెళ్లిపోయాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. ఈ బ్యూటీకి చెప్పుకోదగ్గ పాత్ర లేకపోయినా తన అందాలతో ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేసింది. అయితే, ఏజెంట్ రిజల్ట్ తరువాత సాక్షి పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ, అందరికీ షాకిస్తూ సాక్షి వైద్య ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని రిలీజ్‌కు రెడీ చేసింది.

Sakshi Vaidya Starts Dubbing For Her Next Movie

Agent Movie : పోకిరి, బాహుబలి 2.. ఇప్పుడు అఖిల్ ఏజెంట్.. ఆ సెంటిమెంట్ రిపీట్ అవ్వుద్దా?

మెగా హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘గాంఢీవధారి అర్జున’లో నటిస్తోంది సాక్షి వైద్య. తాజాగా ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ కూడా స్టార్ట్ చేసింది ఈ చిన్నది. ఇలా ఏజెంట్ సినిమాతో అఖిల్ వెకేషన్‌కి వెళితే.. సాక్షి వైద్య మాత్రం లొకేషన్‌లో డబ్బింగ్ చెబుతూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు.