Sriya Reddy : సలార్‌లో నటించిన శ్రియారెడ్డి.. ఆ ఇండియన్ క్రికెటర్‌ కుమార్తె అని మీకు తెలుసా..?

సలార్ తన నటనతో ఆకట్టుకున్న శ్రియారెడ్డి.. ఆ ఇండియన్ క్రికెటర్‌ కుమార్తె అని మీకు తెలుసా..? అంతేకాదు హీరో విశాల్‌కి ఈమె..

Salaar Actress Sriya Reddy is a daugter of that Indian Cricketer do you know

Sriya Reddy : ప్రభాస్ సలార్ సినిమాలో వరదరాజు (పృథ్వీరాజ్ సుకుమారన్) సోదరిగా రాధా రామ పాత్రలో నటించిన తమిళ నటి శ్రియారెడ్డి.. ప్రస్తుతం టాలీవుడ్ లో తెగ వైరల్ అవుతున్నారు. మూవీలో ఆమె యాక్టింగ్‌కి, లుక్స్‌కి ఆడియన్స్ ఫిదా అయ్యిపోయారు. సలార్ సినిమాను చూసినవారంతా ఆమె పాత్రను ‘బాహుబలి’లో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్రతో పోల్చుతున్నారు.

మరి ఇంతలా తన నటనతో ఆకట్టుకున్నప్పుడు.. ఆమె అసలు ఎవరు..? అంతకుముందు ఏమైనా సినిమాల్లో నటించారా..? అనే సందేహాలు రావడం సహజం. ఈ డౌట్స్‌తోనే టాలీవుడ్ ఆడియన్స్ ఆమె గురించి సోషల్ మీడియాలో, గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. శ్రియారెడ్డి గురించి చెప్పాలంటే.. అటు స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఇటు సినిమా బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉంది.

శ్రియారెడ్డి తండ్రి పేరు ‘భరత్‌ రెడ్డి’. 1978-1981 మధ్య కాలంలో క్రికెటర్ గా భారత టీంలో పలు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. ప్రస్తుతం ఇండియన్ టెస్ట్ క్రికెటర్స్ గా కొనసాగుతున్న దినేష్ కార్తీక్, లక్ష్మీపతి బాలాజీలకు శిక్షణ ఇచ్చింది కూడా భారత్ రెడ్డే. భరత్‌ రెడ్డి, శ్రియారెడ్డి చెన్నై వాసులైనప్పటికీ వీరు తెలుగు కుటుంబానికి చెందినవారు. ఇక భారత్ క్రికెటర్ కి కుమార్తె అయిన శ్రియారెడ్డికి హీరో విశాల్‌కి ఉన్న సంబంధం ఏంటని అనుకుంటున్నారా..?

Also read : Prashanth Neel – Rajamouli : రాజమౌళిని మోసం చేసిన ప్రశాంత్ నీల్.. సలార్‌లో ఆ సీన్..

విశాల్‌ అన్న ‘విక్రమ్ కృష్ణ’ని శ్రియారెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విశాల్ కంటే ముందే ఇండస్ట్రీకి వచ్చిన విక్రమ్ కృష్ణ హీరోగా కొన్ని సినిమాల్లో నటించారు. అయితే కొన్నాళ్ల తరువాత యాక్టింగ్ కెరీర్ కి గుడ్ బై చెప్పేసి నిర్మాణంపై అడుగులు వేశారు. అసలు ఇంతకీ శ్రియారెడ్డి, విక్రమ్ కృష్ణకి ఎప్పుడు ఎక్కడ పరిచయం అయ్యింది..?

వీరిద్దరూ కెరీర్ స్టార్టింగ్ లో ‘సథరన్ స్పైస్ మ్యూజిక్’లో వీజేగా చేసేవారు. అక్కడే వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. 2008లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత సినిమా పరిశ్రమకి దూరమయ్యారు. గత ఏడాది వరకు అమెరికాలో ఉన్న శ్రియారెడ్డి.. మళ్ళీ తిరిగి వచ్చి సినిమాల్లో బిజీ అవుతున్నారు. అమెజాన్‌ ప్రైమ్‌లో తెరకెక్కిన ‘సుడల్’ అనే వెబ్ సిరీస్‌లో నటించి రీ ఎంట్రీ ఇచ్చారు.

శ్రియారెడ్డి తెలుగు సినిమాతోనే నటిగా కెరీర్ స్టార్ట్ చేశారు. 2003లో ‘అప్పుడప్పుడు’ అనే సినిమాలో నటించిన శ్రియారెడ్డి.. 2005లో ‘అమ్మ చెప్పింది’ అనే చిత్రంలో నటించి మెప్పించారు. అయితే శ్రియారెడ్డికి నటిగా మంచి ఫేమ్ ని తీసుకు వచ్చిన సినిమా అంటే.. విశాల్ హీరోగా తెరకెక్కిన ‘పొగరు’ సినిమానే. ఆ మూవీలో శ్రియా విలన్ పాత్రలో అదరగొట్టారు. ప్రస్తుతం ‘సలార్’, ‘OG’ వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు.