Prashanth Neel – Rajamouli : రాజమౌళిని మోసం చేసిన ప్రశాంత్ నీల్.. సలార్‌లో ఆ సీన్..

ప్రశాంత్ నీల్, రాజమౌళి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ గా కొనసాగుతున్నారు. అయితే ప్రశాంత్ నీల్ తన రీసెంట్ మూవీ సలార్ తో రాజమౌళిని మోసం చేశారట.

Prashanth Neel – Rajamouli : రాజమౌళిని మోసం చేసిన ప్రశాంత్ నీల్.. సలార్‌లో ఆ సీన్..

Prashanth Neel betrayed Rajamouli from Prabhas Salaar movie

Updated On : December 24, 2023 / 5:36 PM IST

Prashanth Neel – Rajamouli : ప్రశాంత్ నీల్, రాజమౌళి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ గా కొనసాగుతున్నారు. వారి చిత్రాలతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్ గా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ‘సలార్’ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. అయితే ఈ చిత్రంలో ఒక సీన్ తో ప్రశాంత్ నీల్, రాజమౌళిని మోసం చేశారు.

అప్పుడెప్పుడో ఈ సినిమా నుంచి ఒక చిన్న టీజర్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు టిన్ను ఆనంద్, ప్రభాస్ కి ఎలివేషన్ ఇస్తున్న సీన్ తో ఆ టీజర్ సాగుతుంది. “లయన్, చీతా, టైగర్, ఎలిఫెంట్ వెరీ డేంజరస్. బట్ నాట్ ఇన్ జురాసిక్ పార్క్. బీకాస్ థెర్ ఐస్ డైనోసార్” అంటూ టీజర్ లో టిన్ను ఆనంద్ చెప్పిన డైలాగ్ మూవీ పై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.

Also read : Allu Arjun : ఆ నిర్మాత తనకి రెమ్యూనరేషన్ ఇవ్వలేదంటూ అల్లు అర్జున్ పోస్ట్.. అసలేమైంది..?

ఇక ఈ టీజర్ చూసి రాజమౌళి కూడా చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. మూవీలో ఈ సీన్ చూడడం కోసం ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నాను అంటూ.. ఇటీవల సలార్ టీంతో చేసిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఈ సీన్ అసలు మూవీలో లేదు. రాజమౌళితో పాటు చాలా మంది అభిమానులు కూడా ఈ ఎలివేషన్ కోసం ఎదురు చూశారు. కానీ సినిమాలో అది కనిపించకపోవడంతో ప్రశాంత్ నీల్, రాజమౌళిని మోసం చేశారంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.

మొదటి పార్ట్ లో కనిపించని ఈ సీన్, సెకండ్ పార్ట్ లో ఉండనుందేమో అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లేదంటే గతంలో రాజమౌళి చేసినట్లు ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా చేసుతున్నారా అని సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ సమయంలో రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్ కి సంబంధించిన టీజర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సీన్స్ సినిమాలో లేవు. కేవలం టీజర్ కోసం ఆ సీన్స్ ని చిత్రీకరించారు. ఇప్పుడు సలార్ కూడా అలాగే చేశారా అని డౌట్ వెల్లడిస్తున్నారు.