Salaar Goes Global : వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతున్న ప్రభాస్.. ‘సలార్’ హవా.. RRR తర్వాత మళ్ళీ ఇప్పుడే..

గతంలో RRR సినిమాకు ఇదే విధంగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజయి ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. RRR సినిమాని తెగ పొగిడేశారు. మళ్ళీ ఇప్పుడు సలార్ సినిమాని పొగిడేస్తున్నారు. ప్రభాస్ ని, సినిమా యాక్షన్స్ సీన్స్ ని ఆకాశానికెత్తేస్తున్నారు ఫారినర్లు.

Salaar Movie Trending in Worldwide Foreign Audience Promote Salaar Salaar Goes Global Trending

Salaar Goes Global : ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా డిసెంబర్ లో వచ్చిన ‘సలార్’ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ని ఆ రేంజ్ మాస్ లో చూడటంతో అభిమానులు, ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేసారు. సలార్ సినిమా థియేటర్స్ లో పెద్ద హిట్ అయి ఏకంగా 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చి స్ట్రీమింగ్ అవుతుంది సలార్ సినిమా.

ఓటీటీలో కూడా సలార్ సినిమా దుమ్ము దులిపేస్తుంది. సలార్ కేవలం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోనే ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ నాలుగు భాషలకు ట్రెండ్ లో ఉంది అంటే ఇక హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేస్తే మరింత వైరల్ అయ్యేది. ప్రస్తుతం సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. నెట్ ఫ్లిక్స్ లో గత రెండు రోజుల నుంచి ప్రపంచంలోని పలు దేశాల్లో సలార్ సినిమా వైరల్ అయి ట్రెండింగ్ లో ఉంది. వివిధ దేశాల్లోని ప్రజలు సలార్ సినిమా చూసి సోషల్ మీడియాలో సలార్ పై అభినందనలు కురిపిస్తున్నారు.

Also Read : Raviteja : ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ‘రవితేజ’తో సినిమా.. ‘హనుమాన్’లో కోతి పాత్రతో..

గతంలో RRR సినిమాకు ఇదే విధంగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజయి ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. RRR సినిమాని తెగ పొగిడేశారు. మళ్ళీ ఇప్పుడు సలార్ సినిమాని పొగిడేస్తున్నారు. ప్రభాస్ ని, సినిమా యాక్షన్స్ సీన్స్ ని ఆకాశానికెత్తేస్తున్నారు ఫారినర్లు. దీంతో సోషల్ మీడియాలో సలార్ గోస్ గ్లోబల్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. సలార్ సినిమా వరల్డ్ వైడ్ ఈ రేంజ్ లో ట్రెండ్ అవుతుండటంతో ఇక్కడి ప్రభాస్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇక సలార్ ట్విట్టర్ అకౌంట్ లో వివిధ దేశాల్లో సలార్ సినిమా చూసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వాటిని రీ షేర్ చేస్తున్నారు. విదేశీ ప్రేక్షకులు కూడా సలార్ పార్ట్ 2 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే సలార్ సినిమాని ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేయాలని అడుగుతున్నారు. మొత్తానికి సలార్ గోస్ గ్లోబల్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఈ ఊపు చూస్తుంటే RRR లాగే సలార్ ని కూడా ఆస్కార్ దాకా తీసుకెళ్లేలా ఉన్నారు.