Raviteja : ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ‘రవితేజ’తో సినిమా.. ‘హనుమాన్’లో కోతి పాత్రతో..
హనుమాన్ సినిమాలో ఓ కోతి క్యారెక్టర్ ఉంటుంది. ఈ కోతి పాత్రకి రవితేజ వాయిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ ఈ కోతి పాత్రతో తన యూనివర్స్ లో ఒక సినిమా తీస్తాను అని ప్రకటించాడు.

Prashanth Varma Announced Movie with Raviteja as Monkey Character in Hanuman
Prashanth Varma – Raviteja : తేజ సజ్జ(Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఇటీవల సంక్రాంతికి వచ్చిన ‘హనుమాన్'(Hanuman) సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇప్పటికే హనుమాన్ సినిమా 250 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇంకా థియేటర్లలో దూసుకుపోతుంది. హనుమాన్ సినిమా చిన్నా పెద్ద తేడా లేకుండా అందర్నీ మెప్పిస్తుంది. హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పై అంచనాలు పెరిగిపోయాయి. ప్రశాంత్ వర్మ నెక్స్ట్ సినిమాలు ఏంటి అని అంతా ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇక ప్రశాంత్ వర్మ లైనప్ చూస్తే.. అధీరా, జై హనుమాన్, బాలకృష్ణతో సినిమాలు, వీటితో పాటు సూపర్ హీరో సినిమాలు, ఓ సూపర్ హీరోయిన్ సినిమా ఉన్నాయి. ప్రశాంత్ వర్మ ఓ పదేళ్లకు సరిపడా లైనప్ సెట్ చేసి పెట్టుకున్నాడు. ఇప్పటికే హనుమాన్ మూవీ యూనిట్ ఓ సక్సెస్ ప్రెస్ మీట్ పెట్టగా తాజాగా నేడు మరోసారి సక్సెస్ సెలెబ్రేషన్స్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు.
హనుమాన్ సక్సెస్ ఈవెంట్ లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమా గురించి, సినిమాలో నటించిన వారి గురించి పలు ఆసక్తికర అంశాలు మాట్లాడారు. హనుమాన్ సినిమాలో ఓ కోతి క్యారెక్టర్ ఉంటుంది. కోటి అనే పాత్రతో ఈ కోతి పాత్ర హనుమాన్ సినిమాలో అక్కడక్కడా కనిపించి మెప్పిస్తుంది. ఈ కోతి పాత్రకి రవితేజ వాయిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలో ఈ కోతి పాత్ర హైలెట్ అయింది. అయితే ప్రశాంత్ వర్మ ఈ కోతి పాత్రతో తన యూనివర్స్ లో ఒక సినిమా తీస్తాను అని ప్రకటించాడు.
Also Read : HanuMan : వసూళ్లలో దూసుకుపోతున్న ‘హనుమాన్’.. 250 కోట్ల కలెక్షన్స్
ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. రవితేజ గారిని మూడేళ్ళ క్రితం అడిగాను హనుమాన్ సినిమాలో కోతికి వాయిస్ ఓవర్ ఇవ్వాలని, అప్పుడు ఆయన ఓకే అన్నారు. సినిమా అయ్యాక మూడేళ్ళ తర్వాత వెళ్తే ఆయన సినిమా కూడా అదే టైంకి రిలీజ్ ఉంది. అలాంటప్పుడు అడిగితే ఇస్తారా, ఇవ్వరా అని డౌట్ తోనే అడిగితే రా చెప్పేద్దాం డబ్బింగ్ అన్నారు. ఇండస్ట్రీలో మనల్ని అలా సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంత జెన్యూన్ పర్సన్ నాకు దొరకడం నాకు హ్యాపీ. రవితేజ గారికి హనుమాన్ లో భాగమైనందుకు చాలా థ్యాంక్స్. హనుమాన్ సక్సెస్ తర్వాత నాకొక చిన్న ఐడియా వచ్చింది మా సినిమాటిక్ యూనివర్స్ లో ఆ కోతి క్యారెక్టర్ ని ముందుకి ఎలా తీసుకెళ్తే బాగుంటుంది అని. రవితేజ గారు ఒప్పుకుంటే ఆ కోటి క్యారెక్టర్ తోనే(కోతితో) ఒక సినిమా తీస్తాం మా యూనివర్స్ లో అని అనుకుంటున్నాను అంటూ తెలిపారు. దీంతో ప్రశాంత్ వర్మ వ్యాఖ్యలు వైరల్ గా మారగా ఆయన యూనివర్స్ పై రోజురోజుకి మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. రవితేజ అభిమానులు కూడా ఈ సినిమా వర్కౌట్ అవ్వాలని అని ఆనందం వ్యక్తపరుస్తున్నారు.