HanuMan : వసూళ్లలో దూసుకుపోతున్న ‘హనుమాన్’.. 250 కోట్ల కలెక్షన్స్

'హనుమాన్' సినిమా రికార్డుల మోత మోగుతోంది. భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న హనుమాన్ రూ.250 కోట్లు వసూలు చేసింది.

HanuMan : వసూళ్లలో దూసుకుపోతున్న ‘హనుమాన్’.. 250 కోట్ల కలెక్షన్స్

HanuMan

Updated On : January 27, 2024 / 12:48 PM IST

HanuMan : హనుమాన్ మూవీ ప్రభంజనం మాములుగా లేదు. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 15 రోజుల్లో 250 కోట్ల మార్క్‌ను చేరుకుని దూసుకుపోతోంది.

Yatra : ధనుష్ పెద్ద కొడుకుని చూసారా? అచ్చు ధనుష్ లాగే ఉన్నాడు..

తేజ సజ్జ-ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన ‘హనుమాన్’ హవా మామూలుగా లేదు. ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఆదరణ లభిస్తోంది. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా 15 రోజుల్లో రూ.250 కోట్ల మార్కుని చేరుకుని భారీ కలెక్షన్స్ రాబట్టింది. మొదటివారం సోసో గా అనిపించిన కలెక్షన్స్ రోజురోజుకి మరింత ఊపందుకున్నాయి. 11 రోజుల్లో రూ.112 కోట్ల గ్రాస్, రూ.209 కోట్ల షేర్ రాబట్టింది.

Natti Kumar : చిరంజీవికి పద్మవిభూషణ్ పవన్ కల్యాణ్ వల్లే వచ్చిందట.. నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు

కే.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా మొదటివారంలో దేశ వ్యాప్తంగా రూ.115 కోట్లు రాబట్టింది. రెండవ వారం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ స్ట్రాంగ్‌గా కనిపించింది. రెండవ వారంలో దాదాపుగా రూ.153 కోట్ల వసూలు సాధించింది. పది రోజుల్లో రూ.202 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక 15వ రోజుకి రూ.250 కోట్ల మార్క్‌ను చేరుకుంది. ఈ సినిమాను సుమారుగా రూ.60 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. సౌత్, నార్త్‌లో కూడా హనుమాన్ హవా కొనసాగుతోంది. విదేశాల్లో కూడా పెద్ద హీరోల కలెక్షన్స్ రికార్డులు బద్దలు కొడుతూ హనుమాన్ చుక్కలు చూపిస్తోందని చెప్పాలి.