Yatra : ధనుష్ పెద్ద కొడుకుని చూసారా? అచ్చు ధనుష్ లాగే ఉన్నాడు..
చెన్నైలో 'లాల్ సలామ్' ఆడియో ఫంక్షన్ వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో కనిపించిన ధనుష్ పెద్ద కొడుకు యాత్ర అచ్చు ధనుష్‌లాగ ఉండటంతో అందరూ ఆశ్చర్యపోయారు.

Yatra
Yatra : ధనుష్ పెద్ద కొడుకు యాత్ర ‘లాల్ సలామ్’ ఆడియో ఫంక్షన్‌లో తల్లితో పాటు కనిపించాడు. అచ్చుగుద్దినట్లు తండ్రి ధనుష్ పోలికలతో ఉండటంతో అందరూ ఆశ్చర్యపోయారు.
Natti Kumar : చిరంజీవికి పద్మవిభూషణ్ పవన్ కల్యాణ్ వల్లే వచ్చిందట.. నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు
ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ జంట విడిపోయి 2 సంవత్సరాలు కావొస్తుంది. విడాకులు తీసుకుంటామని అప్పట్లో అధికారిక ప్రకటన చేసినా ఎందుకో తీసుకోలేదు. ఎవరి కెరియర్లో వారు బిజీగా ఉన్నారు. కానీ పిల్లల విషయంలో ఇద్దరు బాధ్యతగా ఉంటున్నట్లు కనిపిస్తోంది. రీసెంట్‌గా ఐశ్వర్య డైరెక్ట్ చేసిన ‘లాల్ సలామ్’ సినిమా ఆడియో ఫంక్షన్ చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఐశ్వర్య పెద్ద కుమారుడు యాత్ర, రెండవ కుమారుడు లింగ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ముఖ్యంగా ధనుష్ పెద్ద కొడుకు యాత్ర అచ్చు గుద్దినట్లు ధనుష్‌లాగే ఉన్నాడంటూ అందరూ ఆశ్చర్యపోయారు. ఆడియో ఫంక్షన్‌లో తల్లితో పాటు వీరిద్దరూ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లాల్ సలామ్ ఐశ్వర్య డైరెక్ట్ చేసారు. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో రజనీకాంత్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్ అల్లిరాజా నిర్మించారు.
View this post on Instagram