Prabhas Salaar
Salaar Team Bumper offer : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas) వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో సలార్ (Salaar) ఒకటి. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. హోంబలే ఫిలింస్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. సెప్టెంబర్ 28న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అందులో భాగంగా ఈ చిత్ర టీజర్‌ను జులై 6న ఉదయం 5 గంటల 12 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఓ బంపర్ ఆఫర్ తో ముందుకు వచ్చింది. సలార్ జర్నీలో భాగం అయ్యే అవకాశాన్ని కల్పించింది. మోస్ట్ వయాలెంట్ మేన్(ప్రభాస్) గురించి ఎక్కువ మందికి తెలియజేసేలా మీ ప్రతిభ, క్రియేటివిటీని ఉపయోగించి డిజైన్‌లు, మతిపోగొట్టే వీడియోలు చేయాలని తెలిపింది. సలార్ పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచేలా అవి ఉండాలని సూచించింది.
Devil Glimpse : కళ్యాణ్ రామ్ డెవిల్ గ్లింప్స్ అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్
ఇందులో సలార్ టీమ్‌ను మెప్పించగలిగే వారిని సలార్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రజలకు పరిచయం చేయనున్నట్లు తెలిపింది. దీంతో చాలా మంది ఫ్యాన్స్‌తో పాటు నెటీజన్లు రంగంలోకి దిగారు. తమ టాలెంల్‌కు పదును పెడుతున్నారు.
??????? ??? ?????? ???? ?
We want YOU to be a part of this incredible journey.
Show off your talent by creating stunning designs and mesmerising video edits, capturing the essence of the most violent man and building anticipation among our beloved fans.The… pic.twitter.com/T1lUz0uQSk
— Salaar (@SalaarTheSaga) July 3, 2023
Bigg Boss OTT 2 : అతడే కాదు.. ఎవరు ఉన్నా సరే లిప్‌లాక్ ఇచ్చేదాన్ని
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుల అంచనాలను మించే ఉంటుందని చిత్ర బృందం ఇప్పటికే తెలియజేసింది. ఈ చిత్రంలో ప్రభాస్‌ను అత్యంత క్రూరమైన వ్యక్తిగా చూపించనున్నట్లు తెలుస్తోంది. కేజీఎఫ్ మాదిరిగానే ఈ సినిమా కూడా డార్క్ థీమ్‌తో తెరకెక్కుతుండగా పృథ్వీరాజ్ సుకుమార్, శ్రుతీ హాసన్, జగపతి బాబు లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.