Salman Khan : కొత్త బుల్లెట్ ప్రూఫ్ కార్ కొన్న సల్మాన్ ఖాన్.. కార్ విలువ ఎన్ని కోట్లు తెలుసా?

సల్మాన్ ఖాన్ కి బెదిరింపులు వచ్చిన దగ్గర్నుంచి బుల్లెట్ ప్రూఫ్ కార్ వాడుతున్నారు.

Salman Khan Buys Another bulletproof Car Mercedes Maybach GLS 600 SUV Model

Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 59 ఏళ్ళు వచ్చినా ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా సినిమాలు, టీవీ షోలతో ఫ్యాన్స్ ని, ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. అయితే కొన్ని రోజుల క్రితం సల్మాన్ ఖాన్ కి చంపేస్తామని బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి, వ్యక్తిగతంగా ఒకరిద్దరి నుంచి సల్మాన్ ఖాన్ కి ఇప్పటికే పలుమార్లు బెదిరింపులు వచ్చాయి.

సల్మాన్ ఖాన్ కి బెదిరింపులు వచ్చిన దగ్గర్నుంచి బుల్లెట్ ప్రూఫ్ కార్ వాడుతున్నారు. ఇంట్లోంచి బయటకు రావాలంటే సల్మాన్ కి బుల్లెట్ ప్రూఫ్ కార్ ఉండాల్సిందే. కొన్నాళ్ల క్రితమే ఓ రెండు కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్ కార్ కొన్నాడు సల్మాన్. తాజాగా సల్మాన్ ఖాన్ మరో బుల్లెట్ ప్రూఫ్ కార్ కొన్నాడట.

Also Read : Venu Sriram : పాపం డైరెక్టర్.. నాని, అల్లు అర్జున్ చుట్టూ తిరిగి తిరిగి.. చివరకు నితిన్ తో.. ‘తమ్ముడు’ వెనక ఇంత స్టోరీ ఉందా?

మెర్సిడెస్ మేబాచ్ GLS 600 SUV మోడల్ బుల్లెట్ ప్రూఫ్ కార్ ని సల్మాన్ ఖాన్ ఇటీవలే ఒక వారం క్రితం కొన్నాడట. ఈ కారు ధర ఇండియాలో ఆల్మోస్ట్ 3.4 కోట్ల నుంచి 3.9 కోట్ల వరకు ఉంది. దానికి ఉన్న సెక్యూరిటీ స్పెషాలిటీస్ ని బట్టి కార్ ధరలో చేంజ్ ఉంటుందట. తనకు ఉన్న బెదిరింపులు కారణంతోనే సల్మాన్ ఇంత ఖర్చు చేసి మరో బుల్లెట్ ప్రూఫ్ కార్ కొన్నాడని సమాచారం.

ఇక సల్మాన్ ఇటీవలే సికిందర్ సినిమాతో వచ్చి ఫ్లాప్ చూసాడు. త్వరలో 7 డాగ్స్ అనే సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను ట్రైజెమినల్ న్యూరాల్జియా, బ్రెయిన్ అన్యూరిజం, AV మాల్ ఫర్మేషన్.. లాంటి పలు వ్యాధులతో బాధపడుతున్నాను అని చెప్పడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

Also Read : Sanya Thakur : నిఖిల్ స్పై సినిమా హీరోయిన్ గుర్తుందా.. నీలి రంగు చీరలో అందాలతో సాన్య థాకూర్..