Venu Sriram : పాపం డైరెక్టర్.. నాని, అల్లు అర్జున్ చుట్టూ తిరిగి తిరిగి.. చివరకు నితిన్ తో.. ‘తమ్ముడు’ వెనక ఇంత స్టోరీ ఉందా?
దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో తమ్ముడు ప్రాజెక్టు ఎలా సెట్ అయిందో చెప్పారు.

Venu Sriram Nithiin Thammudu Movie Back Story Director Wait for Nani Allu Arjun Dates
Venu Sriram : నితిన్ తమ్ముడు సినిమాతో జులై 4న రాబోతున్నాడు. ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. అయితే నితిన్ తో తమ్ముడు సినిమా చేయడానికి ముందు చాలా కథ నడించిందట. తాజాగా తమ్ముడు ప్రమోషన్స్ లో దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో తమ్ముడు ప్రాజెక్టు ఎలా సెట్ అయిందో చెప్పారు.
దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తో ఐకాన్ సినిమా అనౌన్స్ చేసారు గతంలో. కానీ ఆ సినిమా సమయంలో అల్లు అర్జున్ పుష్ప మొదలు పెట్టడంతో ఐకాన్ ప్రాజెక్టు పక్కకు వెళ్ళిపోయింది. పుష్ప తో స్టార్ డమ్ రావడం వెంటనే పుష్ప 2 సినిమా చేయడంతో ఐకాన్ మొత్తానికే పక్కకు వెళ్ళిపోయింది. దీంతో వేణు శ్రీరామ్ ఐకాన్ పక్కన పెట్టి తమ్ముడు కథ రాసుకున్నారు.
Also Read : Vijay Varma : తమన్నాతో బ్రేకప్.. ఇప్పుడు ఈ హీరోయిన్ తోనే రిలేషన్..?
ఈ కథని ఒక ఇద్దరు ముగ్గురు హీరోలకు వినిపించారు. ఫైనల్ గా నాని ఓకే చెప్పారు. నాని గతంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో MCA చేసారు. అందులో వదిన, మరిది రిలేషన్ ఉంటుంది. తమ్ముడు సినిమాలో అక్క, తమ్ముడు రిలేషన్ ఉంటుంది. దీంతో MCA 2 అని కూడా అనుకున్నారట. కానీ నానికి వరుస సినిమాలు ఉండటంతో డేట్స్ ఇవ్వలేకపోయాడట. సంవత్సరం పాటు వెయిట్ చేసినా ఇంకా లేట్ అవుతుందని చివరకు వేణు శ్రీరామ్ దిల్ రాజు దగ్గరికి వెళ్లి ఎవరో ఒక హీరోని ఇవ్వండి తమ్ముడు సినిమాని చేస్తాను అంటే అప్పుడు దిల్ రాజు నితిన్ దగరికి తీసుకెళ్లి కథ చెప్పించి ఓకే చేశారట.
అలా డైరెక్టర్ వేణు శ్రీరామ్ అల్లు అర్జున్, నాని డేట్స్ కోసం ఎదురుచూసి చివరకు నితిన్ తో తమ్ముడు సినిమాను పట్టాలెక్కించాడు. పైగా ఈ సినిమాకు వేణు శ్రీరామ్ రెమ్యునరేషన్ తీసుకోకుండానే పనిచేశారట. సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన డబ్బులో కొంత శాతం ఇస్తానని దిల్ రాజు స్వయంగా తెలిపారు. మరి తమ్ముడు సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.
Also Read : Salman Khan : సల్మాన్ ఖాన్ పోస్టర్ ని బాత్రూంలో పెట్టుకున్న హీరోయిన్.. కానీ ఆ హీరో వచ్చాక..