Vijay Varma : తమన్నాతో బ్రేకప్.. ఇప్పుడు ఈ హీరోయిన్ తోనే రిలేషన్..?

ఏం జరిగిందో ఏమో అంతలోనే ఈ ఇద్దరూ విడిపోయారు.

Vijay Varma : తమన్నాతో బ్రేకప్.. ఇప్పుడు ఈ హీరోయిన్ తోనే రిలేషన్..?

After Breakup with Tamannaah Bhatia Vijay Varma love with Fatima Sana Shaikh Rumors goes Viral

Updated On : June 25, 2025 / 10:25 AM IST

Vijay Varma : బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తమన్నాతో రిలేషన్ లో ఉన్నాడని వీరిద్దరూ కొన్నాళ్ల క్రితం అధికారికంగానే ప్రకటించారు. లస్ట్ స్టోరీస్ సినిమా సమయంలో తమన్నా – విజయ్ క్లోజ్ అయ్యారని, ఇద్దరూ ప్రేమించుకున్నారని చెప్తూ ఒకరి గురించి ఒకరు తెగ పొగిడేశారు. కొన్నాళ్ల పాటు ఇద్దరూ కలిసి కనిపించి క్యూట్ లవ్ కపుల్ అనిపించుకున్నారు.

కానీ ఏం జరిగిందో ఏమో అంతలోనే ఈ ఇద్దరూ విడిపోయారు. లవ్ స్టోరీ అధికారికంగా చెప్పినా వాళ్ళు విడిపోయింది మాత్రం చెప్పలేదు. కానీ తమన్నా, విజయ్ వర్మ సన్నిహితులు మాత్రం వాళ్ళు విడిపోయారు అనే చెప్తున్నారు. ఈ ఇద్దరూ కూడా కలిసి కనపడట్లేదు. అయితే తాజాగా విజయ్ వర్మ మరో హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని బాలీవుడ్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి.

Also Read : Salman Khan : సల్మాన్ ఖాన్ పోస్టర్ ని బాత్రూంలో పెట్టుకున్న హీరోయిన్.. కానీ ఆ హీరో వచ్చాక..

ఫాతిమా సనా షేక్ అనే హీరోయిన్ తో విజయ్ వర్మ రిలేషన్ లో ఉన్నాడట. ఇటీవల వీరిద్దరూ కలిసి ముంబైలోని ఓ కేఫ్ లో క్లోజ్ గా కనిపించారు. దీంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని బాలీవుడ్ అంటుంది. ఫాతిమా సనా షేక్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి దంగల్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లూడో, థార్, సామ్ బహదూర్.. లాంటి పలు సినిమాలతో మెప్పించింది. అయితే ఫాతిమా సనా షేక్, విజయ్ వర్మ కలిసి గుస్తాఖ్ ఇష్క్ అనే సినిమాలో కలిసి నటిస్తున్నారని, ఆ సినిమా కోసమే ఇలా క్లోజ్ గా తిరుగుతున్నారని, వాళ్ళ మధ్య ఏం లేదని, వాళ్ళు ఫ్రెండ్స్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

After Breakup with Tamannaah Bhatia Vijay Varma love with Fatima Sana Shaikh Rumors goes Viral

Also Read : Dil Raju : సీఎం చెప్పారని అవార్డు ఎలా ఇస్తాం.. గద్దర్ అవార్డుల విషయంలో దిల్ రాజు కామెంట్స్ వైరల్..