Bigg Boss 18 Promo : హిందీ బిగ్ బాస్.. సీజన్ 18 ప్రోమో రిలీజ్.. ఎప్పట్నించి మొదలు అంటే..

బిగ్ బాస్ హిందీ సీజన్ 18 త్వరలోనే మొదలు కాబోతుంది.

Salman Khan Hindi Bigg Boss Season 18 Promo Released

Bigg Boss 18 Promo : ఆల్రెడీ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగులో సీజన్ 8 నడుస్తుంది. త్వరలో తమిళ్ బిగ్ బాస్ కూడా మొదలు కాబోతుంది. అసలు బిగ్ బాస్ ని ఇండియాలో మొదలుపెట్టిన బాలీవుడ్ లో కూడా కొత్త సీజన్ మొదలు కాబోతుంది. బిగ్ బాస్ హిందీ సీజన్ 18 త్వరలోనే మొదలు కాబోతుంది. ఈ సారి కూడా సల్మాన్ ఖాన్ గెస్ట్ గా హోస్ట్ చేస్తున్నాడు.

Also Read : Laapataa Ladies : 2025 ఆస్కార్ బరిలో.. ఇండియా నుంచి అధికారికంగా వెళ్లిన సినిమా ఇదే..

తాజాగా హిందీ బిగ్ బాస్ సీజన్ 18 కు చెందిన ప్రోమోని విడుదల చేసారు. అలాగే ఈ సీజన్ అక్టోబర్ 6 నుంచి మొదలు కాబోతుందని అధికారికంగా తెలిపారు. ఎప్పుడూ సెన్సేషనల్ అవుతూ వార్తల్లో నిలిచే హిందీ బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్స్ ఈ సారి ఎవరు వస్తారో చూడాలి. మీరు కూడా హిందీ బిగ్ బాస్ సీజన్ 18 ప్రోమో చూసేయండి..