Rrr Promotion Mumbai
RRR : రాజమౌళి- ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో రిలీజ్ కు రెడీ అయిన సినిమా RRR. మూవీ ప్రమోషన్ లో నెక్స్ట్ గేర్ వేశారు దర్శక ధీరుడు రాజమౌళి. హీరోలు జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి ముంబైలో “Roar Of RRR” ఈవెంట్ నిర్వహించారు. కళ్లు చెదిరే సెట్టింగ్స్.. లైటింగ్ మధ్య నిర్వహించిన ఈ వేడుకను ఎక్కడా ప్రసారం చేయలేదు. సరైన సమయం చూసి.. రికార్డెడ్ ఈవెంట్ ను హిందీ ఛానల్స్ లో ప్రసారం చేస్తారని టాక్.
Read Also : RRR : అమెరికాలో అప్పుడే కలెక్షన్స్ వేట మొదలుపెట్టిన ‘ఆర్ఆర్ఆర్’
ముంబైలో RRR ప్రమోషన్ ఈవెంట్ ను భారీగా ఆర్గనైజ్ చేశారు. బాలీవుడ్ బిగ్ షాట్ సల్మాన్ ఖాన్ చీఫ్ గెస్ట్ గా అటెండయ్యాడు. సల్మాన్ ప్రెజెన్స్ ఈవెంట్ కు మరింత హైప్ తీసుకొచ్చింది. బాలీవుడ్ ప్రొడ్యూసర్, ప్రమోటర్ కరణ్ జోహార్ హాజరైన ఈ ఈవెంట్ లో.. ఫీమేల్ లీడ్స్ ఆలియా భట్, శ్రియ తళుక్కుమన్నారు. కీరవాణి కూడా హాజరయ్యారు.
Read Also : RRR: ట్రైలర్ చూశాక తారక్-చెర్రీ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. వీడియో వైరల్!
ముంబై ప్రమోషన్ ఈవెంట్ కు సంబంధించి మూవీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లోనూ.. ఆర్కా మీడియా వర్క్స్ ప్రొడ్యూసర్ల అకౌంట్లోనూ అప్ డేట్స్ ఇచ్చారు. ఒక్కో ఫొటో అభిమానుల మైండ్ ను బ్లాక్ చేసేసింది. ఈవెంట్ ను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు ఫొటోలు చూస్తే అర్థం అవుతోంది. సెన్సేషనల్ డైరెక్టర్, ఇండియా ప్రైడ్ దర్శకుడు రాజమౌళి స్టేజీపై ఉండగా.. అటూ ఇటూ తుపాకులు పట్టుకుని ఉన్న ఫొటో అయితే షో మొత్తానికీ హైలైట్ గా చెప్పుకుంటున్నారు అభిమానులు. ఈ సీన్ లో వినిపించే పాట.. రాజమౌళి ఎంట్రీ ఓ లెవెల్ లో ఉంటుందని చెబుతున్నారు.
.@RRRMovie #Prereleaseevent! @ssrajamouli pic.twitter.com/L7zRUfoEMF
— Shobu Yarlagadda (@Shobu_) December 19, 2021
?????? #RoarOfRRRInMumbai pic.twitter.com/8Ckm6uNk2s
— RRR Movie (@RRRMovie) December 19, 2021