Salman Khan Kisi ka Bhai Kisi Ki Jaan Release on Eid
Salman Khan : ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సినిమా రిలీజ్ దగ్గరకొచ్చేసరికి చిన్న చిన్న సెంటిమెంట్స్ కూడా ఫాలో అయిపోతారు. స్పెషల్లీ రిలీజ్ విషయంలో ఏమాత్రం అటూ ఇటూ మిస్ చెయ్యరు. అలా సెంటిమెంట్ ని ఫాలో అయ్యే హీరోల్లో అన్ని పరిశ్రమల వాళ్ళు ఉన్నారు. అందులో బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ముందు వరసలో ఉంటాడు. సల్మాన్ ఖాన్ తన కెరీర్ లో దాదాపు 90 శాతం ఈద్(Eid) సెంటిమెంట్ ని ఫాలో అయ్యారు. ప్రతి సంవత్సరం రంజాన్ కి గ్యారంటీ గా తన సినిమా రిలీజ్ ఉండేలా ఫిక్స్ చేసుకుంటారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఈ సంవత్సరం కిసీ కా భాయ్ కిసీ కీ జాన్(Kisi Ka Bhai Kisi Ki Jaan) సినిమాతో ఈద్ రిలీజ్ కి రెడీ అవుతున్నారు సల్మాన్.
పెద్ద సక్సెస్ లు అందుకున్న తర్వాతే ఈ సీజనల్ రిలీజ్ కాస్తా సెంటిమెంట్ అయిపోయింది సల్మాన్ కు. సల్మాన్ ఖాన్ 2010లో దబాంగ్, 2011లో బాడీగార్డ్, 2012లో ఏక్ థా టైగర్, 2014లో కిక్, 2015లో భజరంగీ భాయ్ జాన్, 2016 లో సుల్తాన్, 2017లో ట్యూబ్ లైట్, 2018లో రేస్ 3, 2019లో భారత్ సినిమాలు ఈద్ కి రిలీజ్ చేశారు. ఈ సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి. దీంతో సల్మాన్ తన నెక్స్ట్ సినిమాలు కూడా ఈద్ కి రిలీజ్ ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు.
Allu Arjun : శాకుంతలంలో అల్లు అర్హ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా.. బన్నీ స్పెషల్ ట్వీట్
ఇప్పుడు కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాతో మరోసారి రంజాన్ కి రాబోతున్నాడు సల్మాన్ ఖాన్. ఈ సారి సౌత్ మార్కెట్ ని కూడా గట్టిగా ఫోకస్ చేసి రిలీజ్ చేస్తున్నాడు సల్మాన్. ఇప్పటికే ఇందులో చాలా మంది సౌత్ స్టార్స్ నటిస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా, వెంకటేష్, చరణ్ గెస్ట్ అప్పీరెన్స్, జగపతిబాబు విలన్ గా.. ఇలా అచలామంది సౌత్ స్టార్స్ తో, బతుకమ్మ సాంగ్ తో సౌత్ మార్కెట్ ని బాగానే టార్గెట్ చేశారు. దాంతో పాటు ఈద్ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఏప్రిల్ 21న ఈ సినిమాని భారీగా రిలీజ్ చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. మరి ఈ సారి కూడా సల్మాన్ ఈద్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.
One week to release … #KisiKaBhaiKisiKiJaan@hegdepooja @VenkyMama @farhad_samji @IamJagguBhai @bhumikachawlat @boxervijender #AbhimanyuSingh @TheRaghav_Juyal @jassiegill @siddnigam_off @ishehnaaz_gill @palaktiwarii @vinalibhatnaga1 pic.twitter.com/NONeHa0RCX
— Salman Khan (@BeingSalmanKhan) April 14, 2023