Site icon 10TV Telugu

Salman Khan : నా గర్ల్ ఫ్రెండ్స్ అంతా మంచోళ్ళే.. నేనే తప్పు చేశా..

Salman Khan spoke about his ex girl friends

Salman Khan spoke about his ex girl friends

Salman Khan :  ఇండియన్ సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్(Bachelor) అంటే సల్మాన్ ఖాన్. 57 ఏళ్ళ వయసు వచ్చినా ఇంకా పెళ్లి(Marriage) చేసుకోవట్లేదు. పెళ్లి గురించి అడిగితే అదే అవుతుంది అని అంటాడు. సల్మాన్ ఫ్యాన్స్ తో పాటు చాలా మంది సల్మాన్ ఖాన్(Salman Khan) పెళ్లి చేసుకుంటే చూడాలి అని అనుకుంటున్నారు. పెళ్లి చేసుకోకపోయినా గర్ల్ ఫ్రెండ్స్ మాత్రం చాలా మంది ఉన్నారు. కాకపోతే ఇప్పుడు వాళ్లంతా మాజీలు అయిపోయారు. బాలీవుడ్(Bollywood) లో ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ లో చాలా మందితో సల్మాన్ ప్రేమ వ్యవహారం నడిపించినా ఎవర్ని పెళ్లి చేసుకోలేదు.

తాజాగా మరోసారి సల్మాన్ ఖాన్ తన ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడాడు. ఇటీవల ఓ టీవీ షోలో సల్మాన్ పాల్గొనగా మీ జీవితం గురించి ఆటోబయోగ్రఫీ రాస్తే అందులో మీ ప్రేమకథలు ఉంటాయా అని అడిగారు. దీనికి సల్మాన్ ఖాన్ సమాధానమిస్తూ.. నా ప్రేమకథలన్ని నాతో పాటే సమాధి అయిపోతాయి. అని అన్నారు. ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ.. అది దేవుడి నిర్ణయం. రాసిపెట్టి ఉంటే జరుగుతుంది. అయినా నా వయసు ఇంకా 57 మాత్రమే. చేసుకుంటాను పెళ్లి. నా గర్ల్ ఫ్రెండ్స్ అంతా మంచోళ్ళే. తప్పంతా నాదే. మొదటి గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోయినప్పుడు ఆమెదే తప్పు అనుకున్నా. కానీ వచ్చిన ప్రతి అమ్మాయి నన్ను వదిలేసి వెళ్లిపోతుంటే అప్పుడు నాదే తప్పని తెలుసుకున్నాను. నేనే వాళ్ళని సరిగ్గా చూసుకోలేదేమో. వాళ్ళు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అని అన్నారు.

PM Mann Ki Baat : మన్‌కీ బాత్ వందో ఎపిసోడ్.. హాజరయ్యిన బాలీవుడ్ స్టార్స్..

అలాగే.. పెళ్లి సంగతి ఏమో కానీ నాకు ఒక పాపని పెంచుకోవాలని ఉంది. కానీ అందుకు మన భారతీయ చట్టాలు ఒప్పుకోవేమో అని అన్నారు సల్మాన్ ఖాన్. దీంతో సల్మాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Exit mobile version