PM Mann Ki Baat : మన్‌కీ బాత్ వందో ఎపిసోడ్.. హాజరయ్యిన బాలీవుడ్ స్టార్స్..

ముంబై రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన మన్‌కీ బాత్ వందో ఎపిసోడ్ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్స్ మాధురీ దీక్షిత్, షాహిద్ కపూర్, డైరెక్టర్ రోహిత్ శెట్టి హాజరయ్యారు.

PM Mann Ki Baat : మన్‌కీ బాత్ వందో ఎపిసోడ్.. హాజరయ్యిన బాలీవుడ్ స్టార్స్..

Madhuri Dixit Shahid Kapoor Rohit Shetty at Mann ki Baat 100th show

PM Mann Ki Baat : 2014లో నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రధాన మంత్రి అయ్యిన తరువాత మన్‌కీ బాత్ అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఆల్ ఇండియా రేడియోలో వచ్చే ఈ ప్రోగ్రామ్ లో ప్రధాని మోదీ తన సందేశాన్ని వినిపిస్తారు. ఈ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం నాడు జరుగుతుంది. ఇప్పటి వరకు మన్‌కీ బాత్ 99 ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. ఈ ఆదివారం (ఏప్రిల్ 30) వందో ఎపిసోడ్ కొనసాగింది. ఇక ఈ మైల్ స్టోన్ ఎపిసోడ్ ని చరిత్రలో నిలిచిపోయేలా ప్లాన్ చేశారు.

Salman Khan – Sooraj Pancholi : జియా ఖాన్ కేసు.. సల్మాన్ ఖాన్ అండగా నిలిచాడు.. సూరజ్ పంచోలి!

ఈ ఎపిసోడ్ ని సుమారు కోటి మంది ప్రజలు వినేలా దేశవ్యాప్తంగా నాలుగు లక్షల ప్రాంతాల్లో తెరలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ముంబై రాజ్ భవన్ లో కూడా తెరని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖలతో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా హాజరయ్యారు. మాధురీ దీక్షిత్ (Madhuri Dixit), షాహిద్ కపూర్ (Shahid Kapoor), డైరెక్టర్ రోహిత్ శెట్టి (Rohit Shetty) మన్‌కీ బాత్ ప్రోగ్రామ్ లో పాల్గొని ప్రధాని సందేశం విన్నారు. అనంతరం మీడియా ముందు మాట్లాడారు.

Salman Khan : తండ్రి కావాలనుకుంటున్నా.. పెళ్లి పై సల్మాన్ కామెంట్స్..

షాహిద్ కపూర్.. “నాయకులు అయిన, రాజులు అయిన ప్రజలతో మమేకం అవ్వాలి. నాయకుడు ఏమనుకుంటున్నాడో ప్రజలకి తెలియాలి అనుకోవడం మోదీ జీ గొప్ప ఆలోచన. అదే గొప్ప నాయకుడికి సంకేతం. ఇది సాధారణ విషయమే కానీ ప్రజలతో ఇలా కనెక్షన్ చాలా లోతైనది. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి నాకు ఆహ్వానం అందడం చాలా గౌరవంగా భావిస్తానను” అంటూ వ్యాఖ్యానించాడు.

మాధురీ దీక్షిత్.. “మోదీ జీ ఒక గొప్ప నాయకుడు. ఇటువంటి కార్యక్రమాలతో గ్రామాలకు సైతం దేశ ప్రధాని ఆలోచనలను చేరేవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చిన్న గ్రామాల వరకు చేరుకోగలిగితే చాలా మంది యువకులకు స్ఫూర్తినిస్తుంది. ప్రజలు సమస్యలను అర్థం చేసుకోవడానికి మోదీ జీ ప్రయత్నం అద్భుతమైనది” అంటూ వెల్లడించింది.

రోహిత్ శెట్టి.. “ఇటువంటి కార్యక్రమం ప్రజలను ఒకచోటికి తీసుకొస్తుంది. దేశంలోని పౌరులందరికీ ప్రధాని మోదీ ఒక స్ఫూర్తి. ప్రపంచంలోని పలు భారతీయ కాన్సులేట్‌లలో కూడా 100వ ఎపిసోడ్‌ను జరుపుకుంటుండడం గర్వంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు.