సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా ‘హవా సింగ్’ ఫస్ట్ లుక్
హర్యానాకు చెందిన ప్రముఖ బాక్సర్ ‘హవా సింగ్’ బయోపిక్ ఫస్ట్ లుక్ సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా విడుదలైంది..

హర్యానాకు చెందిన ప్రముఖ బాక్సర్ ‘హవా సింగ్’ బయోపిక్ ఫస్ట్ లుక్ సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా విడుదలైంది..
ప్రాంతం, భాష ఏదైనా ప్రస్తుతం సినీ పరిశ్రమలో రీమేక్స్, బయోపిక్స్ హంగామా కొనసాగుతోంది. బాలీవుడ్‌లో హర్యానాకి చెందిన బాక్సర్ ‘హవా సింగ్’ బయోపిక్ తెరకెక్కనుంది. యువ కథానాయకుడు సూరజ్ పంచోలి ‘హవా సింగ్’ పాత్రలో నటిస్తున్నాడు. ప్రకాష్ నంబియార్ దర్శకత్వం వహిస్తున్నారు.
కమ్‌లేష్ సింగ్, సామ్స్ ఫెర్నాండెజ్ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ‘హవా సింగ్’ ఫస్ట్ లుక్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా విడుదలైంది. బాక్సర్‌గా రింగ్‌లో ప్రత్యర్థిని రఫ్ఫాడించడానికి పాలు తాగుతూ రెడీ అవుతున్నాడు సూరచ్. హవా సింగ్ క్యారెక్టర్ కోసం బాగా మేకోవర్ అయ్యాడు.
హవా సింగ్ విషయానికి వస్తే.. ఆయన హర్యానాకి చెందిన బాక్సర్. ఇండియన్ హెవీ వెయిట్ బాక్సర్‌గా ఆసియన్ గేమ్స్ (1966, 1970)లో గోల్డ్ మెడల్స్ సాధించారు. అంతేకాదు.. హెవీ వెయిట్ క్యాటగిరీలో పదకొండుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించారు. 2015లో సల్మాన్ ఓ నిర్మాతగా వ్యవహరించిన హిందీ చిత్రం ‘హీరో’తోనే సూరజ్ సినీ ప్రస్థానం మొదలైంది.