Shah Rukh – Salman: సీన్‌లోకి సల్మాన్… షారూక్ కొడుకుకు క్లీన్ సర్టిఫికేట్ వచ్చేనా..!

షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవడంతో సల్మాన్ ఖాన్ మన్నత్ (షారూక్ ఖాన్ నివాసం)కు రావడం హాట్ టాపిక్ గా మారింది.

Salman Sharukh Khan

Shah Rukh – Salman: షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవడంతో సల్మాన్ ఖాన్ మన్నత్ (షారూక్ ఖాన్ నివాసం)కు రావడం హాట్ టాపిక్ గా మారింది. ముంబైలోని బంద్‌స్టాండ్ కు అక్టోబర్ 3 ఆదివారం వచ్చాడు సల్మాన్. అదే రోజు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో షారూక్ కొడుకు ఆర్యన్ అరెస్టు చేసి విచారణకు తీసుకెళ్లారు.

షారూక్ ఖాన్ నివాసం మన్నత్ దగ్గర రేంజ్ రోవర్ కారులో వస్తున్నట్లుగా కనిపించింది. ముందు సీట్లో కూర్చొన్న సల్మాన్ మీడియా వారికి చేతులు ఊపుతూ షారూక్ ఇంట్లోకి వెళ్లిపోయింది కార్. ఒక గంట సేపు మాట్లాడిన తర్వాత సల్మాన్ బయల్దేరుతున్న ఫొటోలనూ క్లిక్ మనిపించింది మీడియా.

గతంలో కృష్ణ జింక హత్య చేసిన కేసులో సల్మాన్ ఖాన్ కొన్నేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. ఎట్టకేలకు కోర్టు చుట్టూ తిరిగి బయటపడగలిగారు.

……………………………………………: వృత్తి రీత్యా డాక్టర్.. ప్రజల కోసం ఫార్మర్

అక్టోబర్ 2, 3 శని, ఆదివారాల్లో బిగ్ బాస్ 15 షూటింగ్ తర్వాత టైగర్ 3కోసం ఆస్ట్రియా వెళ్లనున్నారు సల్మాన్. ఇదిలా ఉంటే మరోవైపు అట్లీ డైరక్షన్ లో లయన్ సినిమాలో నటిస్తున్నారు. షారూక్ ఖాన్.. దీపికా పదుకొనేతో స్పెషల్ సాంగ్ కోసం స్పెయిన్ వెళ్లాల్సి ఉంది. దానిని వాయిదా లేదా రద్దు చేసుకోవాలని చూస్తున్నాడు కింగ్ ఖాన్.

ముంబై శివారులో రేవ్ పార్టీపై నార్కో కంట్రోల్ బ్యూరో అధికారులు దాడులు జరపడం కలకల రేపింది. తీరంలోని క్రూజ్ షిప్ లో ఈ పార్టీ జరగడం విశేషం. రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నారంటూ…సమాచారం రావడంతో శనివారం 2021, అక్టోబర్ 02వ తేదీ శనివారం అర్ధరాత్రి తనిఖీలు చేశారు. అధిక మొత్తంలో కొకైన్, ఎండీని స్వాధీనం చేసుకున్నారు. పలువురు యువతీ, యువకులను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. బాలీవుడ్ స్టార్స్ కు చెందిన పలువురు కొడుకులు అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.