వావ్.. సమంత చెల్లెల్ని చూశారా!
అచ్చు టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతను పోలిన ఆత్మిక పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Samantha Akkineni Doop Pics Viral Social Media 25985
samantha-akkineni:అచ్చు టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతను పోలిన ఆత్మిక పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
అక్కినేని కోడలు పిల్ల సమంత లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ పిక్స్ సమంతవి కాదు.. అచ్చు ఆమెలాఉన్న మరో అమ్మాయివి.. ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనే సంగతి తెలిసిందే.. ఏడుగురి విషయం పక్కన పెడితే సెలబ్రిటీలను పోలిన వ్యక్తి ఒక్కరు కనబడితే చాలు..
వాళ్లకి కూడా సదరు సెలబ్రిటీ పేరుతో జూనియర్ పలానా స్టార్ అని గుర్తింపు వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత టాపిక్ ఎందుకొచ్చిందంటే.. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఆత్మిక అనే వర్థమాన నటి, అచ్చం సమంతలాగానే ఉంది. ఈమెను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
కెరీర్ ప్రారంభించిన కొత్తలో సమంత ఎలా ఉండేదో.. ఆత్మిక అచ్చం అలాగే ఉంది. ఇటీవల ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్న ఆత్మిక ఆ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఆ ఫొటోలను చూసి చాలా మంది సమంత అనే అనుకుంటున్నారు.
పూర్తి వివరాలు తెలుసుకుని అవాక్కవుతున్నారు. దీంతో ఆత్మిక పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకు ముందు అషూ రెడ్డి (తెలుగు బిగ్‌బాస్-3 ఫేమ్) కూడా జూనియర్ సమంత అని గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.