Samantha Akkineni: బాప్‌రే.. సామ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇన్ని లక్షలా?

సక్సెస్ ఉంటే చాలు సినిమా వాళ్ళకి ఎటు చూసినా సంపాదనే వస్తుంది. సక్సెసఫుల్ స్టార్స్ రెండు చేతులతో కాదు ఆరు చేతులతో సంపాదిస్తారు. గతంలో సినీ స్టార్స్ కు సినిమాలలో రెమ్యునరేషన్ తో పాటు టీవీ ప్రకటనలతో కోట్ల రూపాయల సంపాదన వస్తుండేది. ఇప్పుడు రెమ్యునరేషన్, ప్రకటనలతో పాటు సోషల్ మీడియా బ్రాండ్ ప్రమోటర్స్ గా కూడా కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నారు.

Samantha Akkineni

Samantha Akkineni: సక్సెస్ ఉంటే చాలు సినిమా వాళ్ళకి ఎటు చూసినా సంపాదనే వస్తుంది. సక్సెసఫుల్ స్టార్స్ రెండు చేతులతో కాదు ఆరు చేతులతో సంపాదిస్తారు. గతంలో సినీ స్టార్స్ కు సినిమాలలో రెమ్యునరేషన్ తో పాటు టీవీ ప్రకటనలతో కోట్ల రూపాయల సంపాదన వస్తుండేది. ఇప్పుడు రెమ్యునరేషన్, ప్రకటనలతో పాటు సోషల్ మీడియా బ్రాండ్ ప్రమోటర్స్ గా కూడా కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నారు. ఒక్క ఇన్ స్టాగ్రామ్ ద్వారానే ఒక్కో పోస్టుకు లక్షలలో వెనకేసుకుంటున్నారు.

సినిమా నుండి వెబ్ సిరీస్ వరకు.. టీవీ హోస్ట్ నుండి టీవీ ప్రకటనల వరకు ప్రకటనల ద్వారానే కోట్ల రూపాయలు అందుకుంటున్న సమంతా ఇన్ స్టాగ్రామ్ ద్వారా కూడా భారీగానే ఆర్జిస్తున్నారు. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే సామ్ కు ఫాలోవర్లు కూడా భారీగానే ఉన్నారు. ప్రస్తుతం సమంతకు ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే 18 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారంటే ఆమెకున్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. అంతటి ఫాలోయింగ్ ఉంది కాబట్టే కంపెనీలు కూడా వారి బ్రాండ్ ప్రమోట్ చేయాలని క్యూ కడుతున్నారు.

డిమాండ్ ను బట్టే ఇన్ స్టాలో పలు ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్న సామ్ ఇందుకు తగ్గట్లుగానే భారీ రెమ్యునరేషన్‌ అందుకుంటుందట. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్ట్‌కి గాను సమంత దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు వసూలు చేస్తుందని సినీ వర్గాలలో టాక్. అంటే సినిమాలు, వెబ్ సిరీస్, టీవీ ప్రకటనలు, సోషల్ మీడియా ప్రమోషన్ ద్వారా నాలుగు చేతులా సంపాదిస్తుందన్నమాట. ప్రస్తుతం సమంత శాకుంతలం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ కుమార్తె అర్హ బాలనటిగా తెరంగేట్రం చేస్తుంది.