టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు లు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ తరచుగా కలిసి కనిపించడంతో పాటు వెకేషన్స్‌కు కలిసి వెలుతుండం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే.. వీటిపై అటు సమంత గానీ, ఇటు రాజ్ గానీ స్పందించలేదు.
తాజాగా ఈ జంట మరోసారి కెమెరా కంటికి చిక్కింది. వీరు ఇద్దరు ఒకే కారులో కలిసి వెలుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరు కలిసి రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరు కలిసి మరోసారి కనిపించడంతో డేటింగ్ రూమర్లు మరోసారి తెరపైకి వచ్చాయి.
Kingdom twitter review : ‘కింగ్‌డమ్’ ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడిందా..
రాజ్, డీకే సంయుక్తంగా రూపొందించిన ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’, ‘సిటడెల్ : హనీ బన్నీ’ సిరీస్ లో సమంత కీలకపాత్ర పోషించింది. ఈ ప్రాజెక్టుల కోసం వర్క్ చేస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.