Samantha returns for a film shoot instead of honeymoon after second marriage
Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉంటున్న దర్శకుడు రాజ్ ను ఆమె పెళ్లి చేసుకున్నాడు. ఇటీవలే ఈ ఇద్దరి పెళ్లి కోయంబత్తూర్ లోని ఈషా ఆశ్రమంలో జరిగిన విషయం తెలిసిందే. అసలు ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్ గా ఈ పెళ్లి తతంగం పూర్తయ్యింది. దీంతో సమంత రెండో పెళ్లి న్యూస్ నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయ్యింది. అనంతరం స్వయంగా సమంత(Samantha) తన రెండో పెళ్లిని అధికారికంగా ప్రకటించింది. అయితే, పెళ్లి అనంతరం కొత్త జంట హనీమూన్ వెకేషన్ కి వెళతారు అనుకున్నారు అంతా.
Nainika Anasuru: డాన్సింగ్ బ్యూటీ నైనికా.. నాభి అందాలతో నాజూకు ఫోటోలు
కానీ, అలా జరగలేదు. సమంత బ్యాక్ తో వర్క్ అంటూ షూటింగ్ కి వచ్చేసింది. తాజాగా ఈ బ్యూటీ నెక్స్ట్ సినిమా షూటింగ్ కోసం మేకప్ అవుతున్న ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోకి “లెట్స్ డూ దిస్” అనే క్యాప్షన్ ను ఇచ్చింది. దీంతో, పెళ్లి తరువాత సమంత మళ్ళీ షూటింగ్ లో బిజీ అయిపోయింది అంటూ చెప్పకనే చెప్పేసింది. చాలా కాలం తరువాత సమంత తెలుగులో చేస్తున్న సినిమా “మా ఇంటి బంగారం”. ఈ సినిమాను లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కిస్తోంది. చాలా కాలం క్రితమే అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమా సమంత హెల్త్ ఇష్యు వల్ల షూటింగ్ మాత్రం మొదలుకాలేదు.
ఎట్టకేలకు రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసింది సమంత. మధ్యలో పెళ్లి కారణంగా కొన్ని రోజుల బ్రేక్ ఇచ్చానా ఇప్పుడు మళ్ళీ షూటింగ్ లో అడుగుపెట్టింది సామ్. ఇదే విషయాన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. ఇక సమంత-నందిని రెడ్డి కాంబోలో గతంలో “ఓ బేబీ” అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దీంతో ‘మా ఇంటి బంగారం” సినిమాపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. మరి రెండో పెళ్లి తరువాత సమంత చేస్తున్న మొదటి సినిమా ఆమెకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
Samantha returns for a film shoot instead of honeymoon after second marriage