Samantha Celebrated Sankranthi in her Home and Shares Photos
Samantha : సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ పక్క ఆరోగ్యంపై ఫోకస్ చేస్తూ మరో పక్క బిజినెస్ లు చూసుకుంటుంది. ఇటీవలే ఓ నిర్మాణ సంస్థని కూడా ప్రకటించి సినిమాలు తీస్తానని తెలిపింది. సమంత ఫ్యామిలీ చెన్నైలో ఉన్నా సామ్ ఇక్కడే హైదరాబాద్ లో సింగిల్ గానే ఉంటుందని సమాచారం. ఇక రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత సంక్రాంతి స్పెషల్ ఫొటోలు పోస్ట్ చేసింది.
సంక్రాంతికి తాను ఏం చేసానో చెప్తూ పలు ఫొటోలు పోస్ట్ చేసింది సమంత. సమంత వేసిన ముగ్గు, గాలిపటంతో ఆటలు, తన పెట్స్, లైటింగ్ తో డెకరేట్ చేసిన తన ఇల్లు.. ఇలా పలు ఫొటోలు షేర్ చేసి ఒక్కో ఫొటోకు ఒక్కో కొటేషన్ కూడా ఇచ్చింది. సామ్ ఈ ఫొటోలు షేర్ చేసి.. ఇదే నా సంక్రాంతి. హ్యాపీగా ఉన్నాను, గాలిపటంతో ఆడుకున్నాను, భోగిమంటల్లో చెడుని తగలబెట్టాను, చక్కగా తలస్నానం చేశాను, నా పెట్స్ తో ఆడుకున్నాను, ఒక చిన్న ముగ్గు వేశాను, అందమైన పూలతో ఆడుకున్నాను. నా ఇంటిని లైటింగ్ తో డెకరేట్ చేశాను అని పోస్ట్ చేసింది.
Also Read : Keerthy Suresh : ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కీర్తి సురేష్ సంక్రాంతి సెలబ్రేషన్స్ చూశారా?
దీంతో సమంత పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం సమంత ఒక్కతే ఉంటుందని తెలుసు కానీ పండగ కూడా ఒక్కతే తన ఇంట్లోనే చేసుకుందని ఈ ఫొటోలతో తెలుస్తుంది. తన ఇంట్లో పని వాళ్ళు మాత్రమే ఉండొచ్చని సమాచారం. ఇక అభిమానులు, నెటిజన్లు ఆమెకు సోషల్ మీడియా వేదికగా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నారు.