Pawan Kalyan-Samantha : పవన్ తో పోటి పడుతున్న సమంత

పవన్ కల్యాణ్ సినిమాలతో సమంత పోటీపడుతుందన్న వార్త ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిగ్గా మారింది.

Samantha competing with Pawan

పవన్ కల్యాణ్ సినిమాలతో సమంత పోటీపడుతుందన్న వార్త ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిగ్గా మారింది. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కల్యాన్ నటిస్తున్న హరి హర వీర మల్లు మే9 న రిలీజ్ అంటు నిర్మాత ఎంత చెప్తున్న సినిమాపై మాత్రం చాలా డౌట్స్ వస్తునే ఉన్నాయంట. షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవడం, దానిపై పవన్ నుండి గ్రీన్ సిగ్నల్ లేకపోవటం, దీంతో అదే డేట్ కు సమంత తన సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుందట.

ప్రస్తుతం పెద్ద హీరో సినిమా అంటే మరో సినిమాను రిలీజ్ చేయడానికి మిగతా వాళ్లు భయపడుతుంటారు. కానీ సమంత మాత్రం భయపడకుండా మే 9న తాను నిర్మాతగా వున్న శుభం సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించటంతో టాలీవుడ్ లో ఓ షాక్ తగిలినట్టు ఉందంటున్నారు.

వారం వారం సినిమాలు రిలీజ్ అవుతున్నా థియేటర్లు ఖాళీగా ఉంటున్న‌ పరిస్థితిలో సమంత ఏకంగా పవన్ కు పోటిగా దిగటం ఏంటనే చర్చ నడుస్తోంది.

Suhas : తమిళ్ లోకి ఎంట్రీ ఇస్తున్న తెలుగు యువ హీరో.. ఏ సినిమాలో తెలుసా? ఇక్కడ వరుస సక్సెస్ లు.. అక్కడ ఏం చేస్తాడో..

ఇక సమంత అలా చేసిందంటే హరి హర వీర మల్లు సినిమా రిలీజ్ కావటం లేదనే కామెంట్స్ టాలీవుడ్ వర్గాల్లో విన్పిస్తున్నాయంట. ఇంతకీ ఏ సినిమా విడుదల అవుతుంది? ఏది ఆగిపోతుందనినేది సస్పెన్స్ గా మారింది. మరి రెండూ రిలీజ్ అయితే మాత్రం సమంత ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే అంటూ టాలీవుడ్ లో టాక్ విన్పిస్తోంది.