Samantha : ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ మేకింగ్ వీడియో బయటపెట్టిన సమంత

'ఊ అంటావా.. ఊ ఊ అంటావా' అంటూ సాంగ్ రిలీజ్ అయ్యాక ఈ పాట అన్ని చోట్ల ఊపేసింది. తాజాగా ఈ సాంగ్ రిహార్సిల్ వీడియోని సమంత తన యూట్యూబ్ ఛానెల్ లో షేర్ చేసింది. రిహార్సిల్ లో.......

`samantha

Samantha :   ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సినిమా భారీ విజయం సాధించింది. దేశమంతటా కూడా మంచి కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్ కూడా చేసిన విషయం తెలిసిందే. చైతూతో విడిపోయాక మొదటి సారి తెరమీద కనపడటం, అది కూడా ఐటెంసాంగ్ అవ్వడంతో పాటని అనౌన్స్ చేసిన దగ్గరి నుంచి ఈ పాట మీద చాలా అంచనాలు పెరిగాయి.

‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ అంటూ లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యాక ఈ పాట అన్ని చోట్ల ఊపేసింది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లోకి వెళ్ళింది. మంచి మాస్ బీట్ తో అదిరిపోయే పాట ఇచ్చాడు దేవిశ్రీ ప్రసాద్. దీంతో ఎక్కడ చూసినా ఇదే పాట వినపడింది. ఈ పాట లిరికల్ రిలీజ్ చేసినప్పుడే సమంత పోస్టర్ రిలీజ్ చేయడంతో సమంత అదరగొట్టేస్తుందని అనుకున్నారు. ఇక ఆ తర్వాత సినిమా విడుదల అయ్యాక ఐటెం సాంగ్ అంటే ఏ మాత్రం తగ్గకుండా సమంత తన పర్ఫార్మెన్స్ చూపించింది. సమంత డ్యాన్స్, హావభావాలు చూసి అందరూ స్టన్ అయిపోయారు. ఇప్పటికి కూడా చాలా చోట్ల ఈ పాట ఇంకా రిపీట్ మోడ్ లో వినిపిస్తూనే ఉంటుంది.

Balakrishna : లెఫ్ట్ హ్యాండ్ కూడా రెడీ అయింది.. దొరికితే దవడ పగిలిపోద్ది.. బాలయ్య సీరియస్ వార్నింగ్

తాజాగా ఈ సాంగ్ రిహార్సిల్ వీడియోని సమంత తన యూట్యూబ్ ఛానెల్ లో షేర్ చేసింది. రిహార్సిల్ లో పొట్టి పొట్టి బట్టలతో సమంత డ్యాన్స్ మాస్టర్స్ చూపినట్లు చేస్తూ అదరగొట్టేసింది. కేవలం 40 సెకండ్ల పైన ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత చేసిన మూమెంట్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఎంజాయ్ చేస్తూ సమంత డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆలా చూస్తూ ఉండిపోతున్నారు ప్రేక్షకులు.