Balakrishna : లెఫ్ట్ హ్యాండ్ కూడా రెడీ అయింది.. దొరికితే దవడ పగిలిపోద్ది.. బాలయ్య సీరియస్ వార్నింగ్

ఈ షోలో ఓ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు బాలయ్య. ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా ఫేక్ న్యూస్ వస్తున్నాయి. అలాంటి ఫేక్ న్యూస్ లపై బాలకృష్ణ ఈ షో ద్వారా స్పందించారు. బాలయ్య మాట్లాడుతూ........

Balakrishna : లెఫ్ట్ హ్యాండ్ కూడా రెడీ అయింది.. దొరికితే దవడ పగిలిపోద్ది.. బాలయ్య సీరియస్ వార్నింగ్

Nbk

Balakrishna :   బాలకృష్ణ యాంకర్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’లో అదరగొడుతున్నారు. సినీ సెలబ్రిటీలని తీసుకొచ్చి వాళ్ళతో సరదాగా ముచ్చటిస్తూ వాళ్ళ లైఫ్ లోని చాలా మూమెంట్స్ ని ప్రేక్షకులకి తెలియచేస్తున్నారు. ఈ ప్రోగ్రాంకి భారీ రెస్పాన్స్ వస్తుంది. అభిమానులే కాక ప్రేక్షకులంతా బాలయ్యని ఈ షో హోస్టింగ్ అదరగొట్టేస్తున్నారు అంటూ పొగిడేస్తున్నారు. ఇప్పటికే ఈ షోలో మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణు, నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, పుష్ప టీం, అఖండ టీం, రవితేజ, గోపీచంద్ మలినేని, రానా వచ్చి అలరించారు. త్వరలో మహేష్ బాబు కూడా రానున్నారు.

తాజాగా ఈ షోలో ఓ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు బాలయ్య. ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా ఫేక్ న్యూస్ వస్తున్నాయి. అలాంటి ఫేక్ న్యూస్ లపై బాలకృష్ణ ఈ షో ద్వారా స్పందించారు. బాలయ్య మాట్లాడుతూ.. ”ఇవాల్టి ప్రపంచంలో ప్రతివాడు సోషల్‌ మీడియాలో ఏం అనాలనిపిస్తే అది అంటున్నాడు. పేరు లేని, లొకేషన్‌ తెలియని అడ్రస్‌లతో బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. బాలకృష్ణకి రవితేజకి పడదు.. చిరంజీవి, బాలకృష్ణ ఫోన్‌లో మాట్లాడుకోరు.. నా హీరో తోపు…నీ హీరో సోపు అంటూ పిచ్చిరాతలు రాస్తున్నారు. నా లెఫ్ట్ హ్యాండ్ కూడా రెడీ అయింది. దొరికితే దవడ పగిలిపోద్ది.” అంటూ ఫేక్‌ న్యూస్‌లు ప్రచారం చేస్తున్న వారికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

AP Cinema Ticket Rates : సినిమా టికెట్ రేట్ల గురించి చాలా మాట్లాడాలి.. సపరేట్‌గా ప్రెస్‌మీట్ పెడతాను

అలాంటి వాళ్ళని మనమేమి చేయం క్షమించి వదిలేస్తాం. మనమీద వచ్చిన విమర్శలను ప్రేమించినప్పుడే కదా మనం అన్‌స్టాపబుల్ అవుతాం అంటూ బాలయ్య తెలిపారు. మొత్తానికి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ రాసేవారికి బాలయ్య గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.