సమంత ఫ్యామిలీ ప్లానింగ్ – హర్ట్ అవుతున్న ఫ్యాన్స్
‘జాను’ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న సమంత.. మరో రెండేళ్లపాటు మాత్రమే సినిమాలు చేస్తానంటోంది..

‘జాను’ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న సమంత.. మరో రెండేళ్లపాటు మాత్రమే సినిమాలు చేస్తానంటోంది..
సమంత స్టార్ హీరోయిన్‌గా 10 ఏళ్లుగా కెరీర్ కంటిన్యూ చేస్తోంది. సౌత్‌లో సీనియర్, జూనియర్ అన్న తేడా లేకుండా అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వస్తోంది. పెళ్లి చేసుకున్నా కూడా ఇంకా చేతినిండా సినిమాలతో అంతకుమించిన సక్సెస్‌లతో బిజీగా ఉన్న సమంత సినిమాల్లో కనిపించేది ఇంకొన్ని రోజులేనా..?
పెళ్లైతే కెరీర్ ది ఎండ్ అని జనరల్‌గా ఫీల్ అయ్యే ఇండస్ట్రీ వాళ్లకి అదిరిపోయే సమాధానం ఇస్తోంది సామ్. పెళ్లైపోయింది.. మహాఅయితే రెండు మూడు సినిమాలు అంతకుమించి కనిపించదు అనుకున్నారు. కానీ.. వరుస సినిమా ఆఫర్లతో పాటు.. అదే రేంజ్ సక్సెస్‌లతో సర్‌ప్రైజ్ చేస్తోంది. తెలుగులో స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూనే తమిళ్‌లో కూడా సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్‌లు అకౌంట్‌లో వేసుకుంది. ప్రస్తుతం శర్వానంద్‌తో చేసిన ‘జాను’ సినిమా మంచి సక్సెస్ అవ్వడంతో ఆ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తోంది సమంత.
సమంతకు పెళ్లై రెండున్నరేళ్లు అయినా.. ఇంకా స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పెళ్లైతే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లే కాదు. హీరోలు కూడా ఆ హీరోయిన్ల మీద పెద్దగా ఇంట్రస్ట్ చూపించరు అనుకునేవాళ్లు కానీ.. పెళ్లి తరవాతే సమంత సక్సెస్ రేంజ్ పెరిగిపోయింది. అంతకు ముందు పెద్దగా ప్రయోగాలు చెయ్యని సమంత.. ఇప్పుడు వరుసగా అదే రూట్‌లో వెళుతోంది. విమెన్ సెంట్రిక్ సినిమాలతో పాటు.. హిందీలో ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌లో విలన్‌గా ఫైట్లు కూడా చేస్తోంది.
ఈ మద్య వరస సక్సెస్‌లతో మంచి ఫామ్‌లో ఉన్న సమంత.. ఇప్పటికే నాకు పెళ్లై 2 సంవత్సరాలు దాటిపోయాయి. మహా అయితే ఇంకో 1, 2 సంవత్సరాలు మాత్రమే సినిమాలు చేస్తానేమో.. ఎందుకంటే.. నేను కూడా ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవాలి కదా అంటోంది. ఈ మాట విన్న ఫ్యాన్స్ హర్ట్ అయిపోయారు. సమంత ఇంక సినిమాల్లో కనిపించేది కొన్ని రోజులేనా.. అంటూ ఇప్పటినుంచే బెంగపడిపోతున్నారు.