Ram Charan – Samantha : ‘గేమ్ ఛేంజర్’ సాంగ్‌లో రామ్ చరణ్ డ్యాన్స్ పై సమంత కామెంట్స్.. ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు అంటూ..

చరణ్ డ్యాన్స్ పై సమంత కూడా కామెంట్ చేసింది.

Samantha Interesting Comments on Ram Charan Dance in Game Changer Song

Ram Charan – Samantha : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా నుంచి నిన్న రా మచ్చ మచ్చ.. అనే మాస్ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఫుల్ మాస్ బీట్ తో ఈ సాంగ్ అదిరిపోయింది. ఇక సాంగ్ లో స్టెప్పులు కూడా చరణ్ అదరగొట్టేసాడు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. అయితే చరణ్ ఈ పాటలో చిన్న గ్లింప్స్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేయగా పలువురు ప్రముఖులు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Varun Tej – Matka : ‘మట్కా’ రిలీజ్ డేట్ అనౌన్స్.. రెట్రో లుక్‌లో వరుణ్ తేజ్ కొత్త పోస్టర్ అదుర్స్..

చరణ్ భార్య ఉపాసన.. మిస్టర్ C నువ్వు హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్నావు అని కామెంట్ చేసింది. అయితే చరణ్ పోస్ట్ కి సమంత కూడా కామెంట్ చేసింది. సమంత చరణ్ డ్యాన్స్ ని ఉద్దేశించి.. ఎవరూ మ్యాచ్ చేయలేరు. అంటే ఫార్మల్ షర్ట్, ప్యాంట్స్ లో ఈ రేంజ్ లో ఎవరు డ్యాన్స్ చేయగలరు అని పొగుడుతూ కామెంట్ చేసింది. దీంతో సమంత కామెంట్ వైరల్ గా మారింది.

సమంత కామెంట్ ని చరణ్ ఫ్యాన్స్ మరింత షేర్ చేస్తున్నారు. బెస్ట్ డ్యాన్సర్స్ లో చరణ్ కూడా ఒకరని తెలిసిందే. తండ్రి నుంచి డ్యాన్స్ ని అందిపుచ్చుకొని తన గ్రేసీ స్టెప్పులతో ఫ్యాన్స్ ని మెప్పిస్తున్నాడు చరణ్. సమంత, చరణ్ కలిసి రంగస్థలం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక గేమ్ ఛేంజర్ సినిమా క్రిస్మస్ కి రిలీజ్ అవుతుందని నిర్మాత దిల్ రాజు తెలిపారు.