Varun Tej – Matka : ‘మట్కా’ రిలీజ్ డేట్ అనౌన్స్.. రెట్రో లుక్‌లో వరుణ్ తేజ్ కొత్త పోస్టర్ అదుర్స్..
తాజాగా మట్కా మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ వరుణ్ తేజ్ రెట్రో లుక్ ని రిలీజ్ చేసారు మూవీ యూనిట్.

Varun Tej Matka Movie Release Date Announced with New Poster
Varun Tej – Matka : సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలు చేస్తాడు వరుణ్ తేజ్. త్వరలో మరో సరికొత్త ప్రయోగం ‘మట్కా’ సినిమాతో రాబోతున్నాడు. వైరా ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో కరుణకుమార్ దర్శకత్వంలో ఈ మట్కా సినిమా తెరకెక్కుతుంది. 1960 బ్యాక్‌డ్రాప్‌తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్ తో మట్కా సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా నవీన్ చంద్ర, నోరా ఫతేహి, సలోని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Also Read : Sree Vishnu : సనాతన ధర్మంపై శ్రీవిష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజాగా మట్కా మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ వరుణ్ తేజ్ రెట్రో లుక్ ని రిలీజ్ చేసారు మూవీ యూనిట్. ఈ పోస్టర్ లో వరుణ్ స్టైలిష్ గా సిగరెట్ తాగుతూ స్టెప్స్ మీద నుంచి దిగుతున్నాడు. చిల్రన్స్ డే రోజు అంటే నవంబర్ 14న మట్కా సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ మట్కా సినిమా పాన్ ఇండియా వైడ్ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతుంది.
వరుణ్ తేజ్ గత సినిమా ఆపరేషనల్ వాలెంటైన్ కమర్షియల్ గా నిరాశపరిచింది. మరి ఈ మట్కా సినిమాతో ఏ రేంజ్ లో ప్రేక్షకులని మెప్పిస్తాడా చూడాలి.
From the streets of Vizag to the corridors of power🔥
Mega Prince @IamVarunTej stepping in to change the game with #MATKA 💥💥
GRAND RELEASE IN THEATRES ON NOVEMBER 14th, 2024 ❤️🔥#MATKAonNOV14th @KKfilmmaker @Meenakshiioffl #NoraFatehi @gvprakash @kishorkumardop @drteegala9 pic.twitter.com/2f4WFkOBKP
— Vyra Entertainments (@VyraEnts) October 1, 2024