Sree Vishnu : సనాతన ధర్మంపై శ్రీవిష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజాగా శ్రీ విష్ణు మీడియాతో ముచ్చటించారు.

Sree Vishnu Interesting Comments on Sanathana Dharmam
Sree Vishnu : హీరో శ్రీ విష్ణు త్వరలో స్వాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అక్టోబర్ 4న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో శ్రీవిష్ణు నాలుగు పాత్రలు వేస్తుండటం, రకరకాల గెటప్స్ వేయడం, ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.
తాజాగా శ్రీ విష్ణు మీడియాతో ముచ్చటించారు. అయితే ప్రస్తుతం తిరుమల లడ్డు వివాదంతో సనాతన ధర్మం అంశం వైరల్ అవుతుండటంతో దీనిపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. శ్రీవిష్ణుకు కూడా సనాతన ధర్మంపై ప్రశ్న ఎదురైంది.
శ్రీవిష్ణు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ.. సనాతన ధర్మం అనేది ఒక జీవన విధానం. మనుషులు ఎలా బతకాలి, ఎలా ఉండాలి, మంచి, చెడు ఏంటి అని చెప్తూ మనం జీవించడానికి ఒక విధానం సనాతన ధర్మం. కాకపోతే అది కాలక్రమేణా ఒకరికే అన్నట్టు మారిపోయింది. మనుషులందరూ ఎలా జీవించాలి అనే సనాతన ధర్మం చెప్తుంది. మా సినిమాలో కూడా సనాతన ధర్మంలో ఉన్న ఆడ, మగ సమానత్వం గురించి చర్చించాం అని తెలిపారు.