Devara 2 : ‘దేవర’ క్లైమాక్స్ లో బాబీ డియోల్ సీన్ తీసేసారు.. పార్ట్ 2 గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన దేవర నటులు..

దేవర సినిమా చూసిన వాళ్లందరికి చాలా ప్రశ్నలు వచ్చాయి.

Devara 2 : ‘దేవర’ క్లైమాక్స్ లో బాబీ డియోల్ సీన్ తీసేసారు.. పార్ట్ 2 గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన దేవర నటులు..

Devara Movie Character Artists Reveal Interesting Elements in Movie

Updated On : October 1, 2024 / 10:00 AM IST

Devara 2 : ఎన్టీఆర్ దేవర సినిమా థియేటర్స్ లో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేవర సినిమా మూడు రోజుల్లో 304 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని మూవీ యూనిట్ ప్రకటించింది. అయితే దేవర సినిమా చూసిన వాళ్లందరికి చాలా ప్రశ్నలు వచ్చాయి. యతి ఎవరు? మురుగ ఎలా చనిపోయాడు? సముద్రంలో ఉన్న అస్థిపంజరాలు ఎవరివి? దేవరని అతను ఎందుకు చంపాడు? వర బతికే ఉంటాడా? ఇలా చాలా ప్రశ్నలు వచ్చాయి. అయితే వీటన్నిటికీ సమాధానాలు దేవర 2 లోనే ఉంటాయని అంతా అనుకుంటున్నారు. మూవీ యూనిట్ నుంచి ఎవరూ ఆడియన్స్ అడిగే ఈ ప్రశ్నలకు రియాక్ట్ అవ్వట్లేదు.

తాజాగా దేవర సినిమాలో నటించిన కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులను ఓ యాంకర్ ఇంటర్వ్యూ చేసారు. సినిమాలో భైరా(సైఫ్ అలీఖాన్) వద్ద పెరిగిన క్యారెక్టర్స్ లో ఒక అయిదుగురిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసారు. వీళ్ళు సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలిపారు.

Also Read : Tejaswi Madivada : ‘జంగిల్ రాణి’ టైటిల్ కోసం బాలీవుడ్ షోలో దూసుకుపోతున్న తెలుగు హీరోయిన్..

దేవర సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ సీన్స్ కూడా షూట్ చేసారని, మాతో బాబీ డియోల్ సీన్ ఉంటుందని చెప్పారని, క్లైమాక్స్ లో బాబీ డియోల్ ఎంట్రీ ఇచ్చి ఆ హైతో సెకండ్ పార్ట్ కి లీడ్ ఇస్తారేమో అనుకున్నాము. కానీ సినిమాలో చూస్తే అసలు బాబీ డియోల్ సీన్ లేదు అని తెలిపారు ఆ నటులు. అలాగే సముద్రంలో ఉన్న అస్థి పంజరాలు ఎవరివి, దేవరని ఎవరు చంపారు.. ఇవన్నీ సెకండ్ పార్ట్ లోనే క్లారిటీ ఇస్తారని తెలిపారు. దీంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

అయితే బాబీ డియోల్ యతి అయి ఉండొచ్చని, దేవర యతి మధ్య యాక్షన్ సీన్స్ ఉండొచ్చని, లేదా వర యతి మధ్య యాక్షన్ సీన్స్ ఉండొచ్చని భావిస్తున్నారు ప్రేక్షకులు. ఫ్యాన్స్ అయితే దేవర 2 గ్రాండ్ గానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడు కొరటాల అని ఇప్పట్నుంచే అంచనాలు వేసుకుంటున్నారు.