Tejaswi Madivada : ‘జంగిల్ రాణి’ టైటిల్ కోసం బాలీవుడ్ షోలో దూసుకుపోతున్న తెలుగు హీరోయిన్..
తేజస్వి మడివాడ ఇటీవల బాలీవుడ్ షో 'రియాలిటీ రాణీస్ ఆఫ్ ది జంగిల్' లో ఎంట్రీ ఇచ్చింది.

Tejaswi Madivada Participating in Bollywood Discovery Channel Show Reality Ranis of the Jungle
Tejaswi Madivada : మన హీరోయిన్స్, నటీనటులు అప్పుడప్పుడు రియాల్టీ షోలలో పాల్గొంటారని తెలిసందే. డబ్బుల కోసమో, పాపులారిటీ కోసమే సెలబ్రిటీలు రియాల్టీ షోలలో పాల్గొంటారు. అయితే ప్రస్తుతం తెలుగు హీరోయిన్ తేజస్వి మడివాడ బాలీవుడ్ లోని ఓ రియాల్టీ షోలో పాల్గొంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన తేజస్వి ఆ తర్వాత హీరోయిన్ గా కూడా మారింది. ప్రస్తుతం చిన్న సినిమాలు, సిరీస్ లలో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగానే ఉంది తేజస్వి.
అయితే తేజస్వి మడివాడ ఇటీవల బాలీవుడ్ షో ‘రియాలిటీ రాణీస్ ఆఫ్ ది జంగిల్’ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ షో మొదలయి వారం రోజులు అవుతుంది. సోమవారం, మంగళవారం రోజుల్లో డిస్కవరీ ఇండియా ఛానల్ లో రాత్రి 10 గంటలకు ఈ షో టెలికాస్ట్ అవుతుంది. ఈ షో కూడా ఒకరకంగా బిగ్ బాస్ లాంటిందే. కానీ అంతకంటే దారుణంగా ఉంటుంది.
Also Read : Aarti Ravi : నా మీద తప్పుడు ప్రచారం.. తనతో మాట్లాడాలి.. విడాకులపై జయం రవి భార్య సంచలన పోస్ట్..
12 మంది లేడీ కంటెస్టెంట్స్ తో ఈ షో ఉంటుంది. జంగిల్ రాణీ టైటిల్ కోసం వీళ్లంతా పోటీ పడతారు. వీళ్ళందర్నీ ఒక అడవిలోకి తీసుకెళ్తారు. వీళ్ళతో పటు హోస్ట్ ఉంటారు, అప్పుడప్పుడు గెస్ట్ లు వస్తారు. ఈ 12 మంది అడవిలోనే ఉంటూ అడవిలోనే దొరికింది తింటూ, వాళ్ళు పెట్టే టాస్కులు పూర్తిచేయాలి. ఈ టాస్కులు చాలా కష్టంగా, దారుణంగా ఉంటాయి. ఇందులో కూడా ఎలిమినేషన్స్ ఉంటాయి. ఈ రియాలిటీ షోలో చివరివరకు ఉండి అన్ని టాస్కులని పూర్తిచేస్తూ గెలిచిన వాళ్ళు జంగిల్ రాణి టైటిల్ గెలుచుకుంటారు.
ఈ రియాలిటీ షోకి మన తేజస్వితో పాటు మరో 11 మంది సెలబ్రిటీలని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ షోలో తేజస్వి అయితే దూసుకెళ్తుంది. మరి జంగిల్ రాణి టైటిల్ గెలుచుకుంటుందా లేదా చూడాలి.