Aarti Ravi : నా మీద తప్పుడు ప్రచారం.. తనతో మాట్లాడాలి.. విడాకులపై జయం రవి భార్య సంచలన పోస్ట్..
సోషల్ మీడియాలో జయం రవి - ఆర్తి రిలేషన్ గురించి చర్చలు జరుగుతున్నాయి. దీంతో ఆర్తి స్పందిస్తూ తన సోషల్ మీడియాలో ఓ సంచలన పోస్ట్ చేసింది.

Jayam Ravi Wife Aarti Reacts on Rumours about Their Relation Sensational post goes Viral
Aarti Ravi : ఇటీవల తమిళ్ హీరో జయం రవి తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్టు, ఇద్దరి పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నాము అంటూ అధికారికంగా పోస్ట్ పెట్టాడు. అయితే దీనిపై జయం రవి భార్య ఆర్తి స్పందిస్తూ.. మా వివాహం గురించి ఇలా పరస్పరం అంగీకారము అంటూ పెట్టడంపై నేను షాక్ అయ్యాను. నాకు తెలియకుండానే ఆ పోస్టు పెట్టారు అంటూ భర్తపై ఆరోపణలు చేసింది.
ఈ క్రమంలో జయం రవి ఓ సింగర్ తో క్లోజ్ అయ్యారని, అందుకే ఆర్తికి విడాకులు ఇస్తున్నారని కొంతమంది అనగా మరికొంతమంది ఆర్తి జయం రవిని ఇబ్బంది పెడుతుందని, అనుమానిస్తుందని అందుకే జయం రవి విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాడని అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇలా జయం రవి – ఆర్తి రిలేషన్ గురించి చర్చలు జరుగుతున్నాయి.
దీంతో తాజాగా ఆర్తి వీటిపై స్పందిస్తూ తన సోషల్ మీడియాలో ఓ సంచలన పోస్ట్ చేస్తూ ఓ లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో.. నా వ్యక్తిగత జీవితం గురించి రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. నన్ను కొంతమంది చెడుగా చూపించి నిజాలను దాయాలనుకుంటున్నారు. నేను మౌనంగా ఉన్నాను అంటే తప్పు చేసానని కాదు కొంచెం హుందాగా వ్యవహరిద్దామని. నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. పరస్పర అంగీకారంతోనే విడాకులు అని అతను ప్రకటన చేసినప్పుడు నేను నిజంగానే షాక్ అయ్యాను. అప్పుడు నేను మాట్లాడిన మాటలు చాలా మంది తప్పుగా అర్ధం చేసుకున్నారు. ఇప్పటికి ఈ విషయంలో అతనితో ఒకసారి వ్యక్తిగతంగా మాట్లాడాలని ఎదురుచూస్తున్నాను. నేను వివాహ వ్యవస్థను గౌరవిస్తాను. మా ఇమేజ్ ని దెబ్బ తీసే ఇలాంటి చర్చలను నేను ఉపేక్షించాను. నా కుటుంబ సంక్షేమం నాకు ముఖ్యం అని ఆర్తి తెలిపింది.
దీంతో ఆర్తి పోస్ట్ వైరల్ గా మారగా అసలు జయం రవి – ఆర్తి మధ్య ఏం జరిగింది అని అంతా చర్చించుకుంటున్నారు. జయం రవి ఏమో విడాకులు అని అనౌన్స్ చేస్తే ఆర్తి ఏమో అతనితో మాట్లాడాలి అని ఇలా పబ్లిక్ గా పోస్టులు చేయడం తమిళనాట చర్చగా మారింది.