Samantha Maa Inti Bangaram teaser update
Maa Inti Bangaram : చాలా కాలం తరువాత నటి సమంత తెలుగులో నటిస్తున్న చిత్రం మా ఇంటి బంగారం. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకురాలు. ఈ రెండు విషయాలు తప్ప ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్‌డేట్ లు రాలేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ ను సమంత సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
జనవరి 9న ఉదయం 10 గంటలకు ఈ చిత్ర టీజర్ ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ‘మీరు చూస్తా ఉండండి.. మా ఇంటి బంగారం మీ అందరీతో కలిసిపోతుంది.’ అంటూ రాసుకొచ్చింది. దీంతో సమంత ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమంత ఈజ్ బ్యాక్ అని కామెంట్లు పెడుతున్నారు.
OG 2 : త్వరలో సెట్స్ పైకి ఓజీ-2?
సమంత, నందిని రెడ్డి కాంబినేషన్‌లో గతంలో ఓ బేబీ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం మంచి విషయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మా ఇంటి బంగారం చిత్రం పై అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని సమంత తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్చ్ పతాకం పై నిర్మిస్తోంది. దర్శకుడు రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో నటిస్తుండగా 1980ల నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది.