Samantha : అప్పుడు అన్న.. ఇప్పుడు తమ్ముడు.. సమంత చేతిలో మరో సినిమా

తాజాగా తమిళ చిత్రం 'బ్యాచిలర్​'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ సతీష్ సెల్వకుమార్ కార్తీకి ఒక కథ చెప్పడంతో కార్తీ ఓకే చేశాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి..........

Sam

Samantha :   సమంత చైతూతో విడిపోయిన తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా సైన్ చేసింది. ప్రస్తుతం సమంత చేతిలో మూడు పాన్ ఇండియా సినిమాలు, ఒక తమిళ్ సినిమా, ఒక వెబ్ సిరీస్, ఒక హాలీవుడ్ సినిమా ఉన్నాయి. త్వరలో బాలీవుడ్ సినిమాలకి కూడా ఓకే చెప్పబోతోంది. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. తాజాగా మరో సినిమాకి సమంత ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

తమిళ స్టార్ హీరో కార్తి డిఫరెంట్ సినిమాలు చేస్తూ తమిళ్ తో పాటు తెలుగులో కూడా మార్కెట్ సంపాదించాడు. ప్రస్తుతం కార్తీ చేతిలో కూడా మూడు సినిమాలు ఉన్నాయి. తాజాగా తమిళ చిత్రం ‘బ్యాచిలర్​’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ సతీష్ సెల్వకుమార్ కార్తీకి ఒక కథ చెప్పడంతో కార్తీ ఓకే చేశాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్​ రెడీ అయింది. ఈ సినిమాలో కార్తీకి జంటగా నటించడానికి సమంతను సంప్రదించినట్లు తెలుస్తోంది. సమంత కూడా ఈ సినిమాకి ఓకే చెప్పినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని తెలుస్తుంది.

Lavanya Tripathi : లావణ్య త్రిపాఠిని చీప్ యాక్టర్ అన్న నెటిజన్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన లావణ్య

సమంత గతంలో కార్తీ అన్నయ్య హీరో సూర్యతో రెండు సినిమాలు చేసింది. 24, సికిందర్ సినిమాలు చేసింది. ’24’ భారీ విజయం సాధించగా ‘సికిందర్’ నిరాశ పరిచింది. ‘సికిందర్’ సినిమాలో సమంత ఒక పాటలో బికినీ కూడా వేసింది. ఇప్పుడు తాజాగా సూర్య తమ్ముడు కార్తితో సినిమా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. మరి వీరిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది.