Samantha reacts to netizens commenting on her weight loss
టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. అయితే.. గత కొన్నాళ్లుగా ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడిప్పుడే సమంత సినిమాలపై ఫోకస్ పెడుతోంది. వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన సిటాడెల్ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
దీంతో ఈ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలతో సమంత బిజీగా ఉంది. ఇక తాజాగా తన సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘క్యూ అండ్ ఎ’ సెషన్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. మళ్లీ బరువు పెరగొచ్చు కదా అని ఓ నెటిజన్ అడిగారు. దీనిపై సమంత మండిపడింది.
Dulquer Salmaan : లక్కీ భాస్కర్ సినిమా ఎందుకు చేసాడో చెప్పిన దుల్కర్ సల్మాన్..
మళ్ళీ బరువు గురించే ప్రశ్న. నా బరువు గురించి నాకు తెలుసు. ప్రస్తుతం నేను చాలా స్ట్రిక్ట్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్‌లో ఉన్నాను. అందువల్లే నా బరువు ఇలా ఉంది. నా ఆరోగ్య పరిస్థితుల వల్ల నేను ఇలానే ఉండాలి. ఇతరులను జడ్డ్ చేయడం ఆపండి. వారిని కూడా బతకనివ్వండి అంటూ కాస్త గట్టిగానే సమంత చెప్పింది.
KA Movie : అంధ విద్యార్థుల కోసం.. కిరణ్ సబ్బవరం క సినిమా స్పెషల్ షో..
సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మయోసైటిస్ కారణంగా సమంత సినిమాలకు కొన్నాళ్లు దూరంగా ఉంది. కోలుకున్నప్పటికి కూడా పలు ఆరోగ్య సమస్యలకు చికిత్స తీసుకుంది. ప్రస్తుతం సమంత చెప్పిన సమాధానాలు చూస్తుంటే ఆమె ఇంకా పూర్తిగా కోలుకోలేదని అర్థం అవుతోంది. ఆమె పూర్తిగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.