KA Movie : అంధ విద్యార్థుల కోసం.. కిరణ్ సబ్బవరం క సినిమా స్పెషల్ షో..

తాజాగా కిరణ్ అబ్బవరం అంధ విద్యార్థుల కోసం క సినిమా స్పెషల్ షో వేశారు.

KA Movie : అంధ విద్యార్థుల కోసం.. కిరణ్ సబ్బవరం క సినిమా స్పెషల్ షో..

Kiran Abbavaram Arranged KA Movie Special Show to Blind People

Updated On : November 4, 2024 / 8:25 PM IST

KA Movie : కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాతో దీపావళికి వచ్చి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా 26 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి కలెక్షన్స్ తో అదరగొడుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో పాటు ఎవరూ ఊహించలేని క్లైమాక్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ సినిమా. మౌత్ టాక్ తో మరింత హిట్ అయింది క సినిమా.

క పెద్ద హిట్ అవ్వడంతో మరింతమందికి చేరువ కావాలని సినిమా రిలీజ్ తర్వాత కూడా రోజూ ఏదో రకంగా మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం క మూవీ టీమ్ వివిధ ఊర్లలో పలు థియేటర్స్ ని సందర్శిస్తున్నారు. అయితే తాజాగా కిరణ్ అబ్బవరం అంధ విద్యార్థుల కోసం క సినిమా స్పెషల్ షో వేశారు.

Also Read : Hebah Patel : పెళ్లి, రిలేషన్ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన హెబ్బా పటేల్.. సరైన అబ్బాయి దొరకట్లేదు..

నేడు మధ్యాహ్నం హైదరాబాద్ సంధ్య థియేటర్లో అంధ విద్యార్థుల కోసం క సినిమా స్పెషల్ షో వేసారు. రెండు అంధ విద్యార్థులు పాఠశాలల పిల్లలు ఈ సినిమాకు వచ్చారు. సౌండ్స్, లైటింగ్ ఎఫెక్ట్స్ తో క సినిమాతో ఒక కొత్త అనుభూతి పొందారు. దీంతో ఈ వీడియో వైరల్ అవ్వగా ఫ్యాన్స్, నెటిజన్లు కిరణ్ అబ్బవరంను అభినందిస్తున్నారు. సినిమా రిలీజయ్యాక కూడా కిరణ్ మొదటగా ఓ అంధ విద్యార్థులు ఉండే ఆశ్రమానికి వెళ్లి అక్కడ పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్నాడు.