Hebah Patel : పెళ్లి, రిలేషన్ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన హెబ్బా పటేల్.. సరైన అబ్బాయి దొరకట్లేదు..

తన పెళ్లి, రిలేషన్స్ గురించి కూడా మీడియాతో మాట్లాడింది హెబ్బా పటేల్.

Hebah Patel : పెళ్లి, రిలేషన్ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన హెబ్బా పటేల్.. సరైన అబ్బాయి దొరకట్లేదు..

Hebah Patel Interview about Dhoom Dhaam Movie and Interesting Comments on Relationship

Updated On : November 4, 2024 / 5:57 PM IST

Hebah Patel : ఒకప్పుడు వరుస హిట్స్ కొట్టిన హెబ్బా పటేల్ మధ్యలో స్పెషల్ సాంగ్స్, కొన్ని ఫ్లాప్స్ చూసినా ఇటీవల మళ్ళీ బిజీ అవుతుంది. చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన సినిమా ‘ధూం ధాం’. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ.. పలువురు ముఖ్య పాత్రలు పోషించగా ఈ సినిమాను ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మాణంలో సాయి కిషోర్ మచ్చా తెరకెక్కించారు. ఈ సినిమాకు స్టార్ రైటర్ గోపీ మోహన్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందించారు. ధూం ధాం సినిమా నవంబర్ 8వ తేదీన రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హెబ్బా పటేల్ నేడు మీడియాతో మాట్లాడింది.

Also Read : G. V. Prakash Kumar : దీపావళితో ఒకేరోజు రెండు హిట్స్ కొట్టిన జి.వి. ప్రకాష్..

ధూం ధాం సినిమా గురించి హెబ్బా పటేల్ మాట్లాడుతూ.. బేబీ డైరెక్టర్ సాయి రాజేశ్ గారు ఒకరోజు ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. కథ విన్నాక చాలా కాలం తర్వాత ఒక మంచి ఎంటర్టైన్మెంట్ రోల్ వచ్చిందని ఒప్పుకున్నాను. ఇలాంటి సినిమా చేసి చాలా కాలమైంది. అందుకే ఓకే చెప్పాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు సుహానా. చాలా బబ్లీ గర్ల్ పాత్ర. ఒక వెకేషన్ కి వెళ్లగా అక్కడ హీరోని కలుస్తుంది. అక్కడ లవ్ స్టోరీ ఉంటుంది. నాకు ఈ పాత్ర చాలా ఈజీగా అనిపించింది అని తెలిపింది.

ఇక ఈ సినిమాలో ఆర్టిస్టుల గురించి మాట్లాడుతూ.. హీరో చేతన్ చాలా కామ్ గా ఉంటాడు. నేనేమో యాక్టివ్. మాలో ఎవరు జూనియర్, సీనియర్ అని చూసుకోలేదు. కెమెరా ముందు ఎలా పర్ఫార్మ్ చేసాము అనే చూసుకున్నాము. ఈ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. నాకు అందరితో కాంబినేషన్ సీన్స్ పడలేదు. ఒక సాంగ్ లో మాత్రం అందరితో కలిసి కనిపిస్తాను అని తెలిపింది.

అయితే తన పెళ్లి, రిలేషన్స్ గురించి కూడా మీడియాతో మాట్లాడింది. హెబ్బా వీటి గురించి స్పందిస్తూ.. గతంలో నేను పెళ్లి చేసుకోను అనే మాట మీద ఇంకా నిలబడ్డాను. ఒకవేళ చేసుకుందాం అనుకున్నా సరైన అబ్బాయి దొరకట్లేదు. ఒక మంచి అబ్బాయి దొరకాలి, రిలేషన్ లో ఉండాలి, అన్ని ఓకే అనుకున్నాక అప్పుడు పెళ్లి గురించి మాట్లాడాలి. ఇవన్నీ జరిగితే అప్పుడు చూద్దాం అని అంది. మరి ఫ్యూచర్ లో హెబ్బా పటేల్ పెళ్లి చేసుకుంటుందేమో చూడాలి.
Hebah Patel

అలాగే.. ఈ సినిమాను పోలెండ్ లో లాంగ్ షెడ్యూల్ షూటింగ్ చేశాం. అక్కడ వింటర్ స్టార్ట్ కాకముందే వెళ్లాం. అయినా రాత్రి కాగానే బాగా చలి ఉండేది. డైరెక్టర్ కిషోర్ గారు చాలా జోవియల్ గా ఉండేవాళ్ళు. ఈ టీమ్ లో నేను గతంలో పనిచేసిన కొంతమంది టెక్నిషియన్స్ కూడా ఉన్నారు అని తెలిపింది. ఈ సినిమాలో నా మీద కంపోజ్ చేసిన టమాటో బుగ్గల పిల్ల సాంగ్ నాగు బాగా నచ్చింది అని చెప్పింది.