Samantha : సమంత కొత్త వైద్యం క్రయోథెరపీ.. వామ్మో అంత చలిలో సమంత కష్టం..

సమంత తాజాగా క్రయోథెరపీ(Cryotherapy) అనే ఓ వైద్యాన్ని తీసుకుంటుంది.

Samantha recently takes a treatment called Cryotherapy

Samantha : ఇటీవల సమంత సినిమాలకు బ్రేక్ ప్రకటించిన తర్వాత తన మయోసైటిస్(Myositis) చికిత్స కోసం, తన ఆరోగ్యం కోసం దేశాలు తిరిగి ఇటీవలే హైదరాబాద్ తిరిగి వచ్చింది. అటు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూనే ఇటు మనసు ఆహ్లాదం కోసం ప్రకృతిని ఆస్వాదిస్తోంది. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన దగ్గర్నుంచి సమంత కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్, బాలి, అమెరికా, ఆస్ట్రియా, ఇటలీ.. లాంటి పలు ప్రదేశాలు తిరిగింది.

ప్రతి చోట ఏదో ఒక ప్రకృతి వైద్యం, కొత్త రకాల వైద్యలు కూడా ట్రై చేసింది సమంత. అయితే అవన్నీ కూడా మయోసైటిస్ కోసమేనా లేక వేరే ఇంకేమైనా ఆరోగ్య సమస్యలకా అనేది తెలియదు. తాజాగా క్రయోథెరపీ(Cryotherapy) అనే ఓ వైద్యాన్ని తీసుకుంటుంది. ఇందులో ఒక పెద్ద స్టీల్ ఫ్రీజర్ లాంటి దాంట్లో మంచు ఆవిరితో చలిలో నిల్చుంది. ఇందులో మైనస్ డిగ్రీస్ లో ఉష్ణోగ్రత ఉంటుందని సమాచారం. ఈ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.

Also Read : Sapta Sagaralu Dhaati : ‘సప్త సాగరాలు దాటి’ సైడ్ B ట్రైలర్ రిలీజ్.. ఈసారి ప్రేమతో పాటు థ్రిల్లింగ్ కూడా..

ఈ క్రయోథెరపీ వలన బ్లడ్ సెల్స్ బాగా పెరుగుతాయని, మన ఇమ్యూనిటీ సిస్టం బలంగా అవుతుందని, బ్లడ్ సర్క్యూలేషన్ బాగా జరుగుతుందని, బాడీకి ఎనర్జి వస్తుందని, మనసు ప్రశాంతంగా ఉంటుందని క్రయోథెరపీకి సంబంధించిన మరో ఫోటో షేర్ చేసింది. దీంతో సమంత క్రయోథెరపీ చేయించుకుంటున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకా మయోసైటిస్ నయమవ్వలేదా సమంతకు, ఈ వైద్యం దేని కోసం తీసుకుంటుంది అని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.