Sapta Sagaralu Dhaati : ‘సప్త సాగరాలు దాటి’ సైడ్ B ట్రైలర్ రిలీజ్.. ఈసారి ప్రేమతో పాటు థ్రిల్లింగ్ కూడా..
తాజాగా సప్త సాగరాలు దాటి సైడ్ B ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక సైడ్ B సినిమాలో హీరో బయటకి వచ్చాక ఏం చేశాడు? తన భార్యని మళ్ళీ కలిశాడా లేదా? కలిసి ఏం చేశాడు అనేది ఉండబోతుంది.

Rakshit Shetty Sapta Sagaralu Dhaati Side B Movie Trailer Released
Sapta Sagaralu Dhaati Side B Trailer : కన్నడ నటుడు రక్షిత్ శెట్టి(Rakshit Shetty) హీరోగా తెరకెక్కిన కన్నడ సినిమా ‘సప్త సాగరదాచే ఎల్లో’ అక్కడ హిట్ అవ్వగా ఆ తర్వాత తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’ అనే పేరుతో రిలీజ్ చేశారు. రుక్మిణి వసంత్(Rukmini Vasanth) ఇందులో హీరోయిన్ గా నటించింది. హేమంత్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో సెప్టెంబర్ 22న రిలీజ్ అయి పర్వాలేదనిపించింది.
ఒక మిడిల్ క్లాస్ కొత్తగా పెళ్లయిన జంట(హీరో – హీరోయిన్) చిన్న జాబ్స్ చేసుకుంటూ సిటీలో బతుకుతుంటారు. ఎవరో చేసిన యాక్సిడెంట్ కేసుని హీరో డబ్బుల కోసం ఒప్పుకొని త్వరగా బయటకి వచ్చి ఆ డబ్బులతో ఇల్లు కట్టుకుందామని హీరోయిన్ ఒప్పుకోకపోయినా జైలుకి వెళ్తాడు. కానీ కేసు ఒప్పుకోమని ఇచ్చిన వాళ్ళు చనిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో హీరో పదేళ్లు జైలులోనే ఉండాల్సి వస్తుంది. ఈ కథని పార్ట్ 1 సైడ్ A అంటూ అందంగా, ఎమోషనల్ గా చూపించారు. ఆ తర్వాత హీరో జైలు నుంచి బయటకి వచ్చి ఏం చేశాడు అనేది పార్ట్ 2 లో చూడాలి.
Also Read : Ram Pothineni : స్కంద సినిమాలో రామ్‌కి డూప్‌గా నటించిన బోయపాటి.. ట్రోల్స్‌కి సమాధానం ఇచ్చిన రామ్..
తాజాగా సప్త సాగరాలు దాటి సైడ్ B ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక సైడ్ B సినిమాలో హీరో బయటకి వచ్చాక ఏం చేశాడు? తన భార్యని మళ్ళీ కలిశాడా లేదా? కలిసి ఏం చేశాడు అనేది ఉండబోతుంది. తెలుగు ట్రైలర్ ని నేడు సమంత రిలీజ్ చేసింది. ఈ సారి తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. నవంబర్ 17న థియేటర్స్ లోకి రానుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులని ఎలా మెప్పిస్తుందో చూడాలి.