Samantha rejects The Girlfriend movie story
Samantha-Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ “ది గర్ల్ ఫ్రెండ్”. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. అను ఇమ్మాన్యుయేల్ మరో కీ రోల్ లో కనిపించనుంది. (Samantha-Rashmika)గీతా ఆర్ట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో ఆయన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా గురించి చాలా ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
Priyamani: వయ్యారాల జాబిల్లి ప్రియమణి.. క్యూట్ ఫోటోలు
నిజానికి, ది గర్ల్ ఫ్రెండ్ సినిమా మొదలైనప్పుడు ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్ గా నటిస్తుంది అనుకున్నారు అంతా. దానికి కారణం రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి సమంత చాలా క్లోజ్. అందుకే ఈ సినిమాను సమంతతో చేస్తున్నారు అనే వార్తలు వైరల్ అయ్యాయి. ఇదే విషయాన్నీ ఇంటర్వ్యూలో రాహుల్ రవీంద్రన్ దగ్గర ప్రస్తావించారు యాంకర్. ఈ సినిమాను ముందు సమంత చేద్దాం అనుకున్నారు అనే వార్తలు వచ్చాయి నిజమేనా? ఒకేవేళ అనుకుంటే ఆమెతో ఎందుకు చేయలేదు అని అడిగారు.
దానికి సమాధానంగా రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా చాలా సెన్సిబుల్ కథ. అందుకే, ఈ సినిమాను ముందు సమంతతో చేద్దాం అనుకున్నాం. కానీ, కథ విన్నాక ఇది నేను చేసేకంటే వేరేవాళ్లు చేస్తేనే బాగుటుంది అని చెప్పింది సమంత. అప్పుడు అదే కథను రష్మికకు పంపాను. తాను రెండు రోజుల్లో కథ మొత్తం చదివి కాల్ చేసింది. ఇలాంటి కథలను తప్పకుండా ఆడియన్స్ కు చెప్పాలి. ఒక అమ్మాయిగా నేను ఈ కథకు చాలా కనెక్ట్ అయ్యాను. ఇది నేను అమ్మాయిలకు ఇచ్చే బిగ్ హగ్ అవుతుంది అంటూ ఒకే చెప్పింది”అంటూ చెప్పుకొచ్చాడు రాహుల్ రవీంద్రన్. దీంతో, సమంత రిజెక్ట్ చేసిన ఈ కథ రష్మిక వద్దకు వెళ్ళింది. మరి ఈ సినిమాతో అంతలా కనెక్ట్ అయినా రష్మిక కు ఫైనల్ గా ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది చూడాలి.