×
Ad

Samantha : కోపం ఎందుకు సమంత..? ఫిట్నెస్ పోస్ట్ పై నెటిజన్ కామెంట్.. సమంత రిప్లై వైరల్..

సమంత ఓ మూడు రోజుల క్రితం జిమ్ లో తన ఫిట్నెస్ మాస్టర్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసింది. (Samantha)

Samantha

Samantha : సెలబ్రిటీలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు, ఫ్యాన్స్ చేసే కామెంట్స్ కి రిప్లైలు ఇస్తుంటారు. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కి కూడా ఘాటు రిప్లైలు ఇస్తారు. అయితే తాజాగా సమంత పెట్టిన పోస్ట్ కి నెటిజన్లు కామెంట్స్ చేయగా దానికి సమంత ఇచ్చిన రిప్లైలు వైరల్ అవుతున్నాయి.(Samantha)

సమంత ఓ మూడు రోజుల క్రితం జిమ్ లో తన ఫిట్నెస్ మాస్టర్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసింది. ఇందులో సమంత ఫేస్ చూపించకుండా తన ఫిట్నెస్ ని చూపిస్తూ ఫోటో షేర్ చేయడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.

Also Read : Nivetha Pethuraj : కుక్క కరిస్తే పెద్ద విషయం కాదట.. హీరోయిన్ వ్యాఖ్యలు వైరల్.. భగ్గుమన్న నెటిజన్లు..

సమంత పోస్ట్ కింద ఓ నెటిజన్.. సన్నగా ఉన్నప్పుడు ఎక్కువ వ్యాయామం చేయకూడదు అని కామెంట్ చేసాడు. దీనికి సమంత.. నాకు అవసరం అయినప్పుడు నీ సలహా అడుగుతాను అని కౌంటర్ ఇచ్చింది. దీంతో తను మంచిగా చెప్తే, అతనికి తోచింది అతను చెప్తే ఎందుకు అంత కోపంగా రిప్లై సమంత అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు సమంతకు ఏం చేయాలో తెలియదా అని ఆమెని సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికి సమంత ఇలాంటి పోస్ట్ కి రిప్లై ఇవ్వడంతో ఇది కాస్త లేటుగా అయినా వైరల్ అయింది.

ఇక మరో నెటిజన్ ఇది రొటీనా లేక ఏదైనా రోల్ కోసం ప్రిపేర్ అవుతున్నారా అని అడగ్గా.. రోల్ కోసం అని చెప్పింది. దీంతో సమంత ఏదో సినిమాలోని పాత్ర కోసం ఈ రేంజ్ లో ఫిట్నెస్ పై దృష్టి పెట్టిందని తెలుస్తుంది. సమంత చేతిలో ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమా, రక్త్‌ బ్రహ్మాండ్‌ వెబ్ సిరీస్ ఉన్నాయి.

Also Read : Producer SKN : నిర్మాతకు వచ్చేది కేవలం 17 పైసలే.. అసలు పాప్ కార్న్ తో మాకు సంబంధమే లేదు.. SKN ట్వీట్ వైరల్..